Monday, April 29, 2024

మార్కెట్ లో హ్యుందాయ్ ఎక్సెటర్ కార్ కి భారీ డిమాండ్.. ధ‌ర వివ‌రాలివే!

భారత ఆటోమొబైల్‌ మార్కెట్‌లోని మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేందుకు జులైలో ఎక్స్‌టర్‌ ను విడుదల చేసింది హ్యుందాయ్ సంస్థ. మార్కెట్ లో లాంచ్ అయినప్ప‌టి నుంచే డిజైన్‌, ధర, స్పెసిఫికేషన్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది ఈ కారు. కాగా, ఎక్స్‌టర్‌ కారు కోసం మే 8 తేదీ నుంచి ముందస్తు బుకింగ్‌లను ప్రారంభించింది. ఇప్పటి వరకు ఎక్స్‌టర్‌ కోసం 65 వేలకుపైగా బుకింగ్‌లు వచ్చినట్లు హ్యుందాయ్ ప్రకటించింది. జులైలో 7000 ఎక్స్‌టర్‌ వాహనాలు విక్రయించినట్లు తెలిపింది.

కాగా, హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌ కారు ప్రారంభ ధర రూ.5,99,900 (ఎక్స్‌షోరూం)గా ఉంది. ఈ కారు 7 వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి EX, EX(O), S, S(O), SX, SX(O), మరియు SX(O) వేరియంట్లలో లభిస్తుంది. హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌ కారు 1.2 లీటర్‌, 4 సిలిండర్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది.

- Advertisement -

ఫీచ‌ర్స్.. ధ‌ర వివ‌రాలు !

ఎక్స్‌టర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ 81.8bhp శక్తి, 113Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే CNG వెర్షన్‌లో 67.7bhp శక్తి, 95.2Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌ మైక్రో SUV పెట్రోల్‌ వెర్షన్‌ 5- స్పీడ్‌ మాన్యువల్‌ లేదా AMT గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌ CNG వేరియంట్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎక్స్‌టర్‌ పెట్రోల్‌ వెర్షన్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ 19.4kmpl మైలేజీని ఇస్తుంది. అదే ఆటోమేటిక్‌ టాన్స్‌మిషన్‌ వేరియంట్‌ 19.2kmpl మైలేజీని ఇస్తుంది. మరియు CNG వేరియంట్‌ 27.1kmpl మైలేజీని అందిస్తుంది.

హ్యుందాయ్‌ SUVలో డ్యాష్‌క్యామ్‌, షార్క్ ఫిన్ యాంటెనా, వైర్‌లెట్‌ ఛార్జింగ్‌ ప్యాడ్‌, పుట్‌వెల్‌ లైటింగ్‌, పాడిల్‌ షిప్టర్లు, ఆన్‌బోర్డు నావిగేషన్‌ సహా మరెన్నో ఫీచర్లు ఉన్నయి. ఈ సెగ్మెంట్‌లో తొలిసారిగా కొన్ని ఫీచర్లను ఎక్స్‌టర్‌ కలిగి ఉంది. దీంతోపాటు 4.2 అంగుళాల డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, ఆపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటోతో కూడిన 8 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ యూనిట్‌ ఎక్స్‌టర్‌ సొంతం.

దీంతోపాటు ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌, పుష్‌ బటన్‌ స్టార్ట్‌, వెనుక AC వెంట్‌లు, డ్రైవర్‌, ప్యాసింజర్‌ సహా సైడ్‌ ఎయిర్‌బ్యాగ్‌లతోపాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉన్న తొలి మైక్రో ఎస్‌యూవీగా ఎక్స్‌టర్‌ ఉంది. ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ (ESC), VSM, హిల్‌ అసిస్ట్‌ కంట్రోల్‌ సహా 26 సెక్యురిటీ ఫీచర్లను కలిగి ఉంది. హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌ మైక్రో SUV బేస్ వేరియంట్‌ EX ధర రూ.5.99 లక్షలు, EX(O) ధర రూ.6.25 లక్షలు, S ధర రూ.7.27 లక్షలు, S(O) ధర రూ.7.42 లక్షలు, SX ధర రూ.8 లక్షలు, SX(O) ధర రూ.8.64 లక్షలు, మరియు SX(O) మరో వేరియంట్‌ ధర 9.32 లక్షలు. అన్ని ధరలు ఎక్స్‌షోరూంగా ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement