Tuesday, May 21, 2024

Protest – వందేళ్ల రైలు గేటు – దశ దశాబ్దాలుగా జనం అవస్థలు

నిజామాబాద్ సిటీ, సెప్టెంబర్ (ప్రభ న్యూస్)3:* నిజామాబాద్ జిల్లా కు గుండె కాయలాంటి గాంధీ గంజ్, శ్రద్ధా నంద్ గంజిలను అనుసంధానం చేస్తూ 100 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన రైల్వే గేట్… అధిక సమయం మూసి ఉంచ డంతో.. గతకొన్ని రోజులుగా రైల్వే గేట్ పరిరక్షణ కమిటి, స్థానిక ప్రజలు వ్యాపారులు కూలీల ఆధ్వర్యంలో రైల్వే గేట్ వద్ద ఆందోళన చేస్తున్నారు.

నిజామాబాద్ అర్బన్ లోని అతీ ముఖ్యమైన ప్రాంతం రైతన్నలా పంటలా లావా దేవీలు బాగా జరిగేటటువంటి శ్రద్ధనంద్ గంజ్ ప్రాంతంలోని రైల్వే గేట్ అధిక సమయం మూసి ఉంచడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఈ ఆందోళనకు వివిధ సంఘాలు , అరె క్షత్రియ సంఘం పట్టణ అధ్యక్షుడు దిలీప్ పవర్, సర్వసమాజ్ కమిటీ కో. కన్వీనర్, ఆదే ప్రవీణ్ లు సంఘీభావం తెలిపాయి.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిజా మాబాద్ జిల్లాలో ఎలాంటి ఉత్సవాలు చేపట్టిన… పండుగ వేడుకలు జరుపుకున్న…. ఈ దారి గుండానే వెళ్లి..జిల్లా ప్రజ లు వైభవంగా జరుపుకుం టారని… అలాంటి ఎంతో చరి త్ర కలిగిన ఈ మార్గంలో ఉన్న రైల్వే గేట్ అధిక సమయం మూసి ఉంచడం ఏమిటని ప్రశ్నించారు. గంజి ప్రాంతం పై ఆధారపడ్డ దినసరి కూలీలు, వ్యాపారులు, స్థానిక ప్రజల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని వాపోయారు.గత కొన్ని రోజులుగా రైల్వే గేట్ సమస్యపై రైల్వే అధికారులకు, ప్రజా ప్రతి నిధులతో మొర పెట్టుకున్న ఎవరు పట్టించు కోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపి రైల్వే గేట్ సమస్య పరిష్కా రానికి కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రైల్వే గేట్ పరిరక్షణ కమిటీ అధ్య క్షులు కోనేరు సాయికుమార్, కూలీలు స్థానిక వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement