Saturday, April 27, 2024

లండన్‌లో ఇంటి అద్దె నెలకు 3 లక్షలు.. అయినా అద్దె ఇళ్లకు తగ్గని డిమాండ్‌!

యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో నివాసం అత్యంత ఖరీదుగా మారింది. వ్యయాలు గతంలో కంటే ఎన్నోరెట్లు పెరిగాయి. ఇంటి అద్దెలు చుక్కలు తాకుతున్నాయి. ఇన్నర్‌ లండన్‌లో అద్దె గత ఏడాది మొదటిసారిగా 3,000 (రూ.3,03,225) పౌండ్లను అధిగమించింది. ఈ ఏడాది ఇవి మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 2022 నాలుగో త్రైమాసికంలో సగటు అద్దె నెలకు 2,480 (రూ.2,50,666) పౌండ్ల రికార్డు స్థాయికి చేరుకుంది. లండన్‌ వెలుపల కొత్తగా జాబితా చేయబడిన ఆస్తుల సగటు అద్దెలు 9.7 శాతం పెరిగాయి. 2021తో పోల్చితే 2022లో 9.9 శాతం మేరకు అద్దెలు పెరిగాయి. లండన్‌లో, పెరుగుతున్న విద్యుత్‌ ధరలతో జీవన వ్యయాలను బ్యాలెన్స్‌ చేయడానికి ఇప్పటికే చాలా మంది పోరాడుతున్నారు.

- Advertisement -

ఇలాంటి సమయంలో ఇంటి అద్దెలు ఖరీదుగా మారడం సామాన్యులకు ఆందోళన కలిగిస్తున్నది. భవనాలు లేదా ఇళ్లు తక్కువ సంఖ్యలో ఉండటం, అద్దెలకు డిమాండ్‌ పెరగడంతోపాటు, ఇల్లు ఖాళీగా ఉన్న సమయంలో నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు యజమానులు అద్దెలను పెంచేస్తున్నారు. ప్రస్తుత పరిణామా లకు ఇవే ప్రధాన కారణాలు. 2023లోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చని ప్రాపర్టీ పోర్టల్‌ నివేదిక అంచనా వేసింది. కనీసంగా అద్దెలు 5శాతం పెరగొచ్చని పేర్కొంది. ప్రస్తుత అద్దెలు 2019 కంటే రెట్టింపు స్థాయిలో ఉందని రైట్‌మూవ్‌కు చెందిన టిమ్‌ బన్నిస్టర్‌ ది టెలిగ్రాఫ్‌తో చెప్పారు.

ఇటీవలి కాలంలో లెటింగ్‌ ఏజెంట్లకు అద్దెల గురించిన రిక్వెస్టులు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. అందుబాటులో ఉన్న ప్రతి ప్రాపర్టీ కోసం పదుల సంఖ్యలో అద్దెదారులు పోటీపడుతున్నారు. బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక ప్రకారం, మరొక నాటకీయ మార్పులో, లండన్‌ ఇంటి యజమానులు ఇప్పుడు ఆన్‌లైన్‌ పోర్టల్‌లకు దూరంగా ఉంటున్నట్లు తేలింది. వాట్సాప్‌ ద్వారా వారి స్వంత నిబంధనలపై తమ ఆస్తులను విక్రయిస్తున్నట్లు స్పష్టమవుతున్నది. 10 లక్షల డాలర్ల కంటే విలువైన ఆస్తులు విక్రయదారుల నుంచి నేరుగా కొనుగోలు దారులకు బదిలీ అవుతున్నాయని బ్రోకర్‌ హాంప్టన్స్‌లోని సీనియర్‌ విశ్లేషకుడు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement