Monday, April 29, 2024

ఉరివేసుకుని హాస్ట‌ల్ విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

ఉరివేసుకుని విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న హనుమకొండ జిల్లాలోని ఓ హాస్ట‌ల్ లో చోటుచేసుకుంది. హన్మకొండ విజయపాల్ కాలనీ నవయుగ పాఠశాలలో విద్యార్థి వంగపడ్ల వివేక్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఏం జ‌రిగిందో తెలియ‌దు విద్యార్థి వివేక్ హాస్టల్ లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స‌మాచారం అందుకున్న సుబేదారి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. విద్యార్థి మృతికి గ‌ల కార‌ణాల‌పై హాస్ట‌ల్ సిబ్బందిని ఆరా తీశారు. అనంత‌రం మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement