Wednesday, May 15, 2024

కాసుపత్రులు !!

కరోనా విజృంభణకు ప్రజలు చిగురుటాకుల్లా వణుకుతుంటే.. కార్పొ
రేట్, ప్రైవేట్ ఆస్పత్రులు తమ సీజన్ వచ్చిందంటూ భయంతో వచ్చిన రోగులను పీల్చిపిప్పి చేస్తున్నాయి. పేషెంట్ల ఆపదను, భయాన్ని ఆసరా చేసుకుని లక్షలాది రూపాయలు దండుకుంటున్నాయి. కొన్ని ఆస్పత్రులు.. బిల్లుల కోసం పది
లక్షలు.. పదిహేను లక్షలు గుంజిన తర్వాత ఇంకా లాగలేం అని భావిస్తే.. ఇక మా వల్లకాదు..గాంధీకి తీసుకెళ్ళండని చావుకబురు చల్లగా చెబుతున్నాయి. కాసులు తమ ఎకౌంట్లో వేసుకుని..రిస్క్ ను గాంధీ ఆస్పత్రి అకౌంట్లో వేస్తున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో సీరియస్ అయిన కేసులను ఆఖరిక్షణాల్లో తమ వద్దకు
పంపుతున్నారని, ఫలితంగా మరణాలుఎక్కువగాకనిపిస్తున్నాయని ఇటీవల గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించిన విషయం విదితమే. ఇక ప్రైవేట్ ఆస్పత్రులలో మృతి చెందిన వారిని.. బిల్లు చెల్లించకుంటే డెడ్ బాడీని కూడా ఇవ్వమంటూ
ఆస్పత్రుల యాజమాన్యాలు దౌర్జన్యం చేస్తున్నాయి. గత ఏడాది కరోనా సమయంలో కొన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు వచ్చాయి. తూతూ మంత్రంగా మొక్కుబడి విచారణ జరిపి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఇప్పుడు మళ్లీ అదే తంతు. కొనసాగుతున్నా.. వైద్య ఆరోగ్యశాఖ కళ్లు మూసుకుని నిస్సహాయంగా వ్యవహరిస్తోంది. తాజాగా మంత్రి ఈటల రాజేందర్ కూడా దీనిపై
స్పందించి శవాలపై పేలాలు ఏరుకోవద్దని చెబుతూనే ప్రైవేట్ ఆస్పత్రులను ఇపుడు ఏం అనే పరిస్థితి లేదని నిస్సహాత వ్యక్తం చేశారు. కాసు పత్రులుగా మారిన కార్పోరేట్, ప్రైవేట్ ఆస్పత్రులకు ఇది మరింత వరంగా మారింది. కలెక్షన్లల్లో మరింతగా రెచ్చిపోతున్నాయి.

ఒక్కో పేషెంట్ వారం నుంచి రెండు వారాల వరకు ఆస్పత్రిలో
ఉండాల్సి వస్తోంది. లక్షల్లో వేస్తున్న హాస్పిటల్ బిల్లులు చెల్లించేందుకు కరోనా బాధిత కుటుంబాలు ఆస్తులు అమ్ముకుని, కష్టపడి కూడబెట్టిందంతా కరిగించుకుని రోడ్డుమీద పడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రతిరోజూ రూ.200 కోట్లకు పైనే కార్పోరేట్, ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా రోగాన్ని సాకుగా చేసుకుని సామాన్యుల భయాన్ని, ప్రాణాలు దక్కించుకోవాలన్న ఆత్రాన్ని సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.

కరోనా పేషెంట్లకు చేసే ట్రీట్మెంట్ కు వసూలు చేసే ఛార్జీల పట్టికను రాష్ట్ర ప్రభుత్వం జీవోరూపంలో గత ఏడాది జూన్లో జారీ చేసింది. ఆ జీవోను తుంగలో తొక్కి తమకు నచ్చిన రేట్లు వేసుకుంటూ ప్రజల ప్రాణాలతో కార్పొరేట్ ఆస్పత్రులు చెలగాటమాడుతున్నాయి. నాలుగున్నర లక్షల రూపాయల బిల్లు కట్టనందుకు వారం క్రితం రామారావు అనే పేషెంట్ ను స్టోర్ రూమ్ లో బంధించింది బేగంపేటలోని విన్ హాస్పిటల్ యాజమాన్యం. కొందరు పేషంట్లు లక్షలాది రూపాయల బిల్లులు కట్టలేమంటూ మంత్రి కేటీఆర్ కు మొర పెట్టుకున్నారు. ఇతర మంత్రులకు 5 కూడా అనేకమంది ఆదుకోమని వినతులుపంపుతున్నారు. గత ఏడాది జీవో ప్రకారం సాధారణ వార్డుల్లో రోజుకు రూ.4 వేల, ఐసీయూ వార్డులో రూ.7,500, వెంటిలేటర్ పెడితే రూ.9 వేలు చొప్పున మాత్రమే వసూలు చేయాలని, అందులో కొన్ని వైద్య పరీక్షలు కూడా కలిసే ఉంటున్నందున వాటికి అదనంగా డబ్బులు వసూలు చేయవద్దని ప్రభుత్వం పేర్కొంది.


కానీ అది అమలెక్కడ?

- Advertisement -

అమలు చేయడం లేదు.. దోపిడీ చేస్తున్నారని అడిగే వారెవరు? ప్రజారోగ్య శాఖ నిబంధనల ప్రకారం కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా టెస్టు చేసినా, పాజిటివ్ గా నిర్ధారణ అయినా, ట్రీట్ మెంట్ ఇస్తున్నా విధిగా రాష్ట్ర ప్రభుత్వం సూచించిన వెబ్ పోర్టల్ లో
పేర్లను ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉంది. కానీ పట్టించుకోని
యాజమాన్యాలు వివరాలను కూడా ప్రభుత్వానికి పంపడంలేదు. ఇక ట్రీట్మెంట్ విషయంలో సైతం ఇష్టారీతిలో ఛార్జీలను వసూలు చేస్తున్న విషయం మంత్రులు, అధికారుల దృష్టికి వెళ్తున్నా పట్టించుకునే వారు, చర్యలు తీసుకునే వారు.. అధిక రెట్లను నియంత్రించే వారే కరువయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement