Thursday, May 2, 2024

చారిత్రక, ఆధ్యాత్మిక అంశాలపై దృష్టి పెట్టండి : భూమన

తిరుపతి సిటీ ప్రభ న్యూస్ : స‌మాజ అభివృద్ధిలో సామాజిక మాధ్యమాల పాత్ర శ్లాఘనీయమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఉద్ఘాటించారు. మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేజ్ అడ్మిన్ లకు మార్గనిర్దేశం చేశారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న తిరుపతికి చెందిన ప్రముఖ పేజ్ యువ అడ్మిన్ లను భూమన ఘనంగా సత్కరించారు. స్థానిక పద్మావతి పురంలోని భూమన నివాసం వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగ్గా ఉన్నారని అడ్మిన్ లను ప్రశంసించారు. మరో వైపు తిరుపతి ఉజ్వల భవిష్యత్ కోసం కృషి చేయాలన్నారు. తిరుపతిలో ముఖ్యంగా ఆధ్యాత్మిక, చారిత్రక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆంద్రప్రదేశ్ వెథర్ మ్యాన్ పేజ్ అడ్మిన్ సాయి ప్రణీత్, బ్యూటీఫుల్ తిరుపతి పేజ్ అడ్మిన్ కే శశిధర్ఇట్స్ మై తిరుపతి పేజ్ అడ్మిన్స్ జోరెపల్లి పృథ్వి రాజ్, ఆర్ నితిన్ కుమార్, యునైటెడ్ తిరుపతి పేజ్ అడ్మిన్స్ చేతన్ కుమార్ రెడ్డి, కొండా కిషోర్ రెడ్డి , తిరుపతి వారియర్స్ పేజ్ అడ్మిన్ కిరణ్ కి భూమన సూచించారు.

ఎప్పటికప్పుడు తిరుపతి, తిరుమల విశేషాలును సామాజిక మాద్యమం ద్వారా దేశ విదేశలోని లక్షలాది మందికి సమాచారాన్ని చేరవేయాలని సంకల్పించడం ముదావహమన్నారు. ఇటీవల బీభత్సం సృష్టించిన వరదలను సైతం లెక్క చెయ్యకుండా అన్ని ప్రాంతాలకు వర్షపాత తీవ్రత హెచ్చరిలను అందిస్తూ, అప్రమత్తం చేసిన ఏపీ వెదర్ మేన్ సాయి ప్రణీత్ సేవలను కొనియాడారు. ఇట్స్ మై తిరుపతి నిర్వాహకులు జోరెపల్లి పృథ్వి రాజ్, నితిన్ కుమార్, బ్యూటిఫుల్ తిరుపతి నిర్వాహకులు శశిధర్…. కరోనా కష్టకాలం తో పాటు తిరుపతి పరిసరాలను అద్బుతంగా ఆవిష్కరించారని తెలిపారు. యునైటెడ్ తిరుపతి నిర్వాహకులు కొండా కిషోర్ రెడ్డి, చేతన్ కుమార్ రెడ్డిలు… స్వామి వారి ఆధ్యాత్మిక కథలకు యానిమేషన్ ద్వారా యూట్యూబ్ లో వీడియోలు పోస్ట్ చేస్తూ ప్రజల మన్ననలను పొందారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం లో తిరుపతి డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు బాలిశెట్టి కిషోర్, నాయకులు మద్దాలి శేఖర్, సూరి, లోకేష్ రాయల్, ముద్ర ప్రసాద్, శీను పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement