Tuesday, May 7, 2024

వ‌రుణ్ తేజ్ కి జోడీగా.. మాజీ మిస్ యూనివ‌ర్స్ మానుషి ఛిల్లార్

హీరో వ‌రుణ్ తేజ్ న‌టిస్తోన్న చిత్రం VT13. ఈ చిత్రంలో హీరోయిన్ గా మాజీ మిస్ యూనివర్స్‌ మానుషి ఛిల్లార్ న‌టిస్తోంది.
శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరో వరుణ్‌ తేజ్‌ ఫైటర్‌ పైలట్‌గా నటిస్తున్నారు. కాగా ఈ ప్రాజెక్ట్‌లో ఫీ మేల్ లీడ్ రోల్‌లో ఎవరు కనిపించబోతున్నారనేది క్లారిటీ ఇచ్చారు మేకర్స్. సోనీ పిక్చర్స్-రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సందీప్ ముద్ద, నందకుమార్‌ అబ్బినేని తెరకెక్కిస్తున్న VT13 ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. VT13లో ఫీ మేల్ లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. ఈ విషయాన్ని స్పెషల్ లుక్‌ ద్వారా తెలియజేశారు మేకర్స్‌. యదార్థ సంఘటనల ఆధారంగా వస్తోన్న ఈ చిత్రాన్ని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ (భారత వైమానిక దళం)కు నివాళులర్పిస్తూ తెరకెక్కిస్తున్నారు. ఇందులో మానుషి ఛిల్లార్‌ రాడార్‌ ఆఫీసర్‌గా కనిపించనుంది. తెలుగు, హిందీ బై లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా వస్తున్న VT13కు సంబంధించి మేకర్స్ ఇప్పటికే పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement