Monday, April 29, 2024

వ‌రుణ్ తేజ్ 13వ మూవీ- ఆస‌క్తి పెంచుతోన్న స్పెష‌ల్ వీడియో

హీరో వ‌రుణ్ తేజ్ ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారుతో ఓ మూవీలో న‌టిస్తున్నాడు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్‌పైకి వెళ్ళ‌నుంది. ఈ చిత్రానికి వ‌రుణ్ తేజ్ తండ్రి నాగబాబు స‌హా ప్రొడ్యూస‌ర్‌గా ఉండ‌టం విశేషం. ఇదిలా ఉంటే వ‌రుణ్ తాజాగా మెగా ఫ్యాన్స్‌కు స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. వ‌రుణ్‌తేజ్ త‌న 13వ సినిమాకు సంబంధించిన ఓ స్పెష‌ల్ వీడియోను విడుద‌ల చేసి మెగా ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు. ఈ వీడియోలో వ‌రుణ్ తేజ్ క్యూరియాసిటీతో స్క్రిప్ట్ చ‌దువుతూ చివ‌రి వ‌ర‌కు వ‌స్తాడు. చివ‌రిలో జై హింద్ అని ఉండ‌టంతో.. అక్క‌డ చిన్న చిరున‌వ్వుతో స్క్రిప్ట్‌ను క్లోజ్ చేసి దానిపై జెట్‌ను పెడ‌తాడు. ఈ వీడియో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. ఫుల్ డిటేయిల్స్ సెప్టెంబ‌ర్ 19న ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు ఆ వీడియోలో వెల్ల‌డించారు. ఈ చిత్రంలో వ‌రుణ్‌తేజ్ ఎయిర్ వింగ్ క‌మాండ‌ర్‌గా క‌నింపిచ‌నున్న‌ట్లు వీడియో చూస్తే తెలుస్తుంది. ‘ఆకాశాన్ని తాకే ఇండియా గ్లోరీ’ అంటూ వరుణ్ తేజ్ ఈ వీడియోను సోష‌ల్‌మీడియాలో అభిమానుల‌తో పంచుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement