Monday, April 29, 2024

రామ‌బాణంతో రానున్న.. గోపీచంద్

హీరో గోపీచంద్ త‌న 30వ చిత్రం టైటిల్ ని ప్ర‌క‌టించాడు. శ్రీవాస్‌ దర్శకత్వం వహించ‌నున్నాడు.ఈ చిత్రానికి రామబాణం అనే పవర్‌ఫుల్‌ టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ టైటిల్‌ని వెండితెరపై రాముడు పాత్రలు పోషించిన బాలకృష్ణ, ప్రభాస్‌ శనివారం విడుదల చేయడం విశేషం. ఈ సినిమాకి కథని భూపతి రాజా, అందించగా,వెట్రి పళని స్వామి ఛాయాగ్రహణం, మిక్కీ జే మేయర్ సంగీతం, ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చనున్నాయి.

2023 వేసవి కానుకగా చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు చిత్ర నిర్మాతలు టి జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టి జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి నిర్మిస్తున్నారు.ఇందులో హీరో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు అన్నగా, ఖుష్బూ వదినగా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గోపీచంద్ కెరీర్‌లో 30వ సినిమాగా రాబోతోన్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం ముగింపు దశలో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement