Wednesday, May 8, 2024

హీరో బాల‌కృష్ణ చేతుల మీదుగా – ఎన్టీఆర్ శ‌త జ‌యంతి వేడుక‌లు

ప్ర‌ముఖ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ చేతుల మీదుగా సీనియ‌ర్ ఎన్టీఆర్ శ‌త జ‌యంతి వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఏడాది మే 28 నుండి ఆయన శత జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టిన ఊరు నిమ్మకూరులో ఈ వేడుకలు మే 28న ఉదయం బాలకృష్ణ చేతుల మీదుగా అత్యంత ఘనంగా ప్రారంభం కానున్నాయి. అలాగే మధ్యాహ్నం గుంటూరులోను, సాయంత్రం తెనాలిలోనూ.. ఈ శత జయంతి సందర్భంగా ఏడాది పొడవునా జరగనున్న కార్యక్రమాలను సైతం బాలకృష్ణ ఆధ్వర్యంలో, ఆయన చేతుల మీదుగానే ప్రారంభిస్తున్నార‌ట‌. వీటికి సంబంధించిన ఏర్పాట్లు భారీగానే జరగనున్నాయి. అన్న గారి శత జయంతి వేడుకలకు అభిమానులు సైతం భారీగా హాజరు కాబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement