Saturday, May 18, 2024

పేషెంట్ డిశ్చార్జ్ అయితే నాకు పండ‌గే.. బాల‌కృష్ణ‌

హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రిలో జన్మదిన వేడుకల్ని నిర్వ‌హించారు హీరో బాల‌కృష్ణ‌. ఈ కార్యక్రమంలో భారీ కేక్ ను కట్ చేశారు. చిన్నారులకు కేక్ తినిపించి.. కానుకల్ని పంపిణీ చేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ..ఆసుపత్రి నుంచి ఒక రోగి డిశ్చార్జ్ అయ్యి వెళ్తుంటే.. తనకు పండుగలా ఉంటుందన్నారు బాల‌య్య‌. మన ఆలోచనలకు మన శరీరాన్ని బానిసగా చేసుకుంటే.. వయసుతో సంబంధం లేకుండా సమాజానికి సేవ చేయవచ్చని సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. మన జీవితానికి మనమే నిర్దేశకులమని చెప్పారు. బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రికి చైర్మన్‌గా ఉండటం తన పూర్వజన్మ సుకృతమని చెప్పారు. దేశంలో రెండో బెస్ట్ క్యాన్సర్ ఆసుపత్రిగా ఓ సర్వేలో నిలిచిందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement