Friday, April 26, 2024

ఆక‌ట్టుకుంటోన్న – బాల‌కృష్ణ 107 చిత్రం ఫస్ట్ లుక్ పోస్ట‌ర్

దివంగ‌త న‌టుడు ఎన్టీఆర్ శ‌త జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న కుమారుడు..న‌టుడు బాల‌కృష్ణ 107వ చిత్రం నుంచి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. చుట్టూ జనమంతా చూస్తుండగా శత్రు సంహారం చేస్తున్న వీరుడిలా ఈ పోస్టర్ లో బాలకృష్ణ కనిపిస్తున్నారు. మంచి ఫిట్ నెస్ తో ఆయన అభిమానులను ఆకట్టుకుంటున్నారు. రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ అలరించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘అఖండ’ హిట్ తరువాత బాలయ్య .. గోపీచంద్ మలినేని చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement