Monday, April 29, 2024

“హలో, దేసీ చాయ్‌ ప్లీజ్‌” అంటే స్పెషల్‌ డిస్కౌంట్‌.. మర్యాదస్థులకు భారీ డిస్కౌంట్‌

సంస్కారంతో మర్యాదగా మాట్లాడటం గొప్ప వ్యక్తిత్వం. సమాజంలో మంచి జీవితాన్ని గడపటానికి ఈ వ్యక్తిత్వం ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు సంస్కారవంతులని, మర్యాదస్తులని గుర్తించాలని ఆరాటపడుతున్నారా ? అందుకు తగిన బహుమానం ఆశిస్తున్నారా ? అయితే, అలాంటి వారి కోసమే యుకెలో ఒక కాఫీ కేఫ్‌ ఎదురు చూస్తోంది. కేఫ్‌ సిబ్బందితో మర్యాదగా మాట్లాడే కస్టమర్‌కు చాయ్‌ రేటులో డిస్కౌంట్‌ లభిస్తుంది. పైగా ఎంత ఎక్కువ మర్యాదగా మాట్లాడితే, ఆ కేఫ్‌లోని చాయ్‌పై కస్టమర్లకు అంత ఎక్కువ డిస్కౌంట్‌ లభిస్తుంది. ఈ కేఫ్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో ఉంది. లాన్కాషైర్‌లో ఇటీవలే చాయ్‌ స్టాప్‌ కేఫ్‌ ప్రారంభమైంది. ఈ చాయ్‌ స్టాప్‌కు వచ్చిన కస్టమర్లు, ఆర్డర్‌ చేసేటప్పుడు హలో, ప్లీజ్‌ వంటి పదాలను ఉపయోగిస్తే వారికి భారీ డిస్కౌంట్‌ లభిస్తుంది.

ఆ చాయ్‌ స్టాప్‌లో దేసీ చాయ్‌ అని అడిగితే 5 డాలర్లు చెల్లించాలి. దేసీ చాయ్‌ ప్లీజ్‌ అని అడిగితే 3 డాలర్లు, హలో దేసీ చాయ్‌ ప్లీజ్‌ 1.90 డాలర్లు చెల్లిస్తే చాలని కేఫ్‌ యజమాని ఉస్మాన్‌ హుస్సేన్‌ ప్రకటించారు. అమెరికన్‌ కేఫ్‌లో పొలైట్‌నెస్‌ రూల్‌ ప్రభావంతో ఈ మార్చిలో స్పెషల్‌ మెనూ టీ ప్రవేశపెట్టినట్లు హుస్సేన్‌ వెల్లడించారు. స్ట్రీట్ఫుట్‌, డిజెర్ట్స్‌ ద్వారా ప్రజల మధ్య ప్రేమ, పొలైట్నెస్‌ వృద్ధి చేయాలన్నది తన లక్ష్యమని ఆయన ప్రకటించారు. చాయ్‌ స్టాప్‌ మెనూను హుస్సేన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement