Friday, May 3, 2024

భారీ వర్షాలతో ‘విద్యుత్ శాఖ’ అప్రమత్తం..

ఐదు జిల్లాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు..
అధికారులకు, సిబ్బందికి సెలవులు రద్దు…
టెలీ కాన్ఫరెన్స్ లో ఏపీ ఎస్ . పి. డి .సి .ఎల్. సి ఎం డి హరినాథ్ రావు..

తిరుపతి సిటీ ప్రభ న్యూస్.. తుఫాను ప్రభావంతో ఏపీ ఎస్ .పి డి .సి ఎల్. పరిధిలోని చిత్తూరు ,కడప ,కర్నూలు ,అనంతపురం, నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు ,సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్. హరినాథ్ రావు ఆదేశించారు. తుఫాను నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా సీఎం డి . హరినాద్ రావు ఐదు జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీర్లు. సీనియర్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు.ఆఫీసర్లతో అత్యవసరంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ కారణంగా ఎదురయ్యే విద్యుత్ సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రత్యేక కంట్రోల్ రూంల‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. చిత్తూరు జిల్లా పరిధిలోని వినియోగదారులు మొబైల్ నెంబర్ 9440817412.. కర్నూల్ 7382614308. నెల్లూరు జిల్లా పరిధిలోని వినియోగదారులు మొబైల్ నెంబర్ 9440817468 లకు కాల్ చేసి ఇ విద్యుత్ ప్రమాదాలు సమస్యలపై సమాచారాన్ని అందించవచ్చు అని తెలియజేశారు.

తుఫాను దృష్ట్యా విద్యుత్ శాఖ అధికారులు సిబ్బందికి సెలవులను రద్దు చేస్తున్నట్లు వివరించారు. వినియోగదారుల సమస్యలపై తక్షణం పరిష్కరించేందుకు వీలుగా ప్రతి సబ్ స్టేషన్ పరిధిలో ఐదుగురు సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. విద్యుత్ స్తంభాలు ఊరికే పాడ‌వ‌డం తదితర ప్రమాదాలు సంభవించి నట్లయితే వాటిని ఎదుర్కొనేందుకు వీలుగా డ్రిల్లింగ్ యంత్రాలు, సామగ్రిని ,వాకి టాకీ =లను సిబ్బంది అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. బలమైన గాలి ,వర్షం ఉన్న సందర్భంలో ప్రజలు విద్యుత్ లైన్లు కు దూరంగా ఉండాలని. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు పడిపోవడం లైన్లు తెగిపోవడం జరిగినట్లయితే తక్షణమే కంట్రోల్ రూమ్ లకు గాని సమీపంలోని విద్యుత్ శాఖ అధికారులు గాని లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1912 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని వినియోగదారులకు విజ్ఞప్తి సి.ఎం.డి హరినాథ్ రావు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement