Sunday, April 28, 2024

ఏపీలో పీఆర్సీపై లొల్లి.. YSR, జగన్ ల మధ్య తేడా అదే!

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్‌సీ నివేదికపై ఉత్కంఠ నెలకొంది. పీఆర్సీపై జాప్యం జరగడంపై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. పీఆర్సీపై తేల్చుకుంటామంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఓట్లు వేసి గెలిపిస్తే తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పీఆర్సీపై ఉద్యోగ సంఘాల జేఏసీలు గురువారం భేటీ అయ్యారు. కార్యాచరణపై చర్చించేందుకు సిద్ధమవుతున్నాయి.

పీఆర్సీ వ్యవహారంపై ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఉద్యోగ సంఘాలతో రాజశేఖరరెడ్డిగారు జరిపిన చర్చలు దానికి అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలు ఆయన రాజకీయ చతురతకు నిదర్శనం. ఆర్థిక శాఖ తరపున ఈ చర్చల్లో పాల్గొనే వాణ్ణి. ముందే రోశయ్య గారితో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చేవారు. దాని కన్నా చాలా తక్కువగా చర్చ మొదలు పెట్టేవాడు. ఉద్యోగ సంఘాల నేతలు ఇదే మీరు ఇస్తే బయట ఉద్యోగస్తులు మమ్మల్ని తిరగనివ్వరు సార్ అని వేడుకునే వారు. చర్చలు రెండో రోజుకు వాయిదా వేసేవారు. ఈ లోపల ఉద్యోగ సంఘాలు బయట ప్రభుత్వం మెడలు వంచి ఉద్యోగస్తుల ప్రయోజనాలను కాపాడుతాం అంటూ ప్రకటనలు చేసేవారు. రెండవ రోజు సమావేశంలో వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రకటించేవారు. సంతోషంగా బయటికెళ్లి ఇది తాము సాధించిన విజయంగా ఉద్యోగ సంఘాలు ప్రకటించుకునేవి’అంటూ ఆయన ట్వీట్ చేశారు. పరోక్షంగా జగన్ ప్రభుత్వం ఉద్యోగుల పీఆర్సీపై నిర్ణయం తీసుకోలేదని ప్రస్తావించారు. వైఎస్సార్ రెండు రోజుల్లోనే నిర్ణయం తీసుకునేవారని.. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదని పరోక్షంగా వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Zika virus: యూపీని వెంటాడుతున్న జికా.. 100 దాటిన కేసులు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement