Wednesday, May 15, 2024

4, 5 తేదీల్లో భారీ వర్షాలు..అంచనా వేస్తున్న వాతావరణశాఖ

తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తీపి కబురు అందించింది. శని, ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. శనివారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కొమరంభీం, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌,వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఆదివారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కొమరంబీం, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో కురుస్తాయని తెలిపింది. అదేవిధంగా ఈనెల 4, 5న రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్‌, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్‌, నిజమాబాద్‌, జగిత్యాల, జనగామ, హన్మకొండ, వికారాబాద్‌, రాజన్నసిరిసిల్ల, సిద్ధిపేట, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాలకు భారీ వర్ష హెచ్చరికను జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement