Monday, June 10, 2024

వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌పై రూ.158 తగ్గింపు

వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరలు తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు వాణిజ్య సిలిండర్ల ధరలనూ తగ్గించాయి. 19 కిలోల కమర్షియల్‌ లిక్విఫైడ్‌ పెట్రోలియం గ్యాస్‌ సిలిండర్లపై రూ. 158 తగ్గించాయి. ఈ ధరలు 1 సెప్టెంబర్‌ 2023 నుండి అమలులోకి వచ్చాయి. తాజా తగ్గింపుతో ఢిల్లిలో వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల ధర రూ.1,522.50 అవుతుంది. శుక్రవారం, బిఎస్‌ఈ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇండెక్స్‌ 250 పాయింట్లు లేదా 1.39 శాతం పెరిగి రూ.18,700 మార్కుకు చేరుకుంది.

ఓఎన్‌జీసీ షేర్లు 4.3 శాతం లాభపడి రూ.181.80కి చేరాయి. జులైలో ఏడు రూపాయలు పెరిగిన వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు ఆగస్టులో రూ. 99.75 మేరకు తగ్గాయి. వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు వరుసగా ఏప్రిల్‌, మే, జూన్‌లలో రూ. 91.50, రూ.172, రూ. 83 చొప్పున తగ్గాయి. ఢిల్లితో పాటు, వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు కోల్‌కతాలో రూ.1,636, ముంబైలో రూ.1,482, చెన్నైలో రూ.1,695గా ఉన్నాయి. దీనికితోడు ఎల్‌పీజీ లిక్విఫైడ్‌ ప్రొపేన్‌, లిక్విఫైడ్‌ బ్యూటేన్‌ దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఛార్జీని సున్నాకి తగ్గించింది. సెప్టెంబరు 1 నుంచి 15 శాతం సెస్‌ ఉండబోదని తెలియజేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement