Wednesday, December 7, 2022

భారీగా ఐఫోన్లు స్వాధీనం.. ఎక్క‌డంటే..

భారీగా ఐఫోన్ల‌ను స్వాధీనం చేసుకున్న ఘ‌ట‌న ముంబై ఎయిర్ ఫోర్టులో చోటుచేసుకుంది. సోమ‌వారం డీఆర్ఐ అధికారులు పార్శిల్స్ ను త‌నిఖీలు చేసి ముంబై ఎయిర్ పోర్టులో భారీగా ఖరీదైన ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ త‌నిఖీల్లో 3646 ఐఫోన్ల‌ను స్వాధీనం చేసుకోగా, వాటి విలువ‌ రూ.42.86 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా వేశారు. ఈ పార్సిల్ హాంకాంగ్ నుంచి ముంబైకు వచ్చినట్లు గుర్తించారు. పార్సిల్ పై ఉన్న చిరునామా ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేశారు. మెమోరీ కార్డుల ముసుగులో ఐఫోన్లను తరలించేందుకు ప్రయత్నించారు. దీనిపై డీఆర్ఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -
   

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement