Friday, May 27, 2022

25రోజుల పాటు పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు .. 36బిల్లుల‌పై చ‌ర్చ ..

కేంద్ర ప్ర‌భుత్వం ముందు ప‌లు స‌మ‌స్య‌ల చిట్టా ఉంది. కాగా నేటి నుంచి పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. లోక్‌‌సభ మొదటి రోజే మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రవేశ పెట్టనున్నారు. దాంతో పాటు క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు, దివాళా(రెండో సవరణ) బిల్లు, 2021, ఎలక్ట్రిసిటీ(సవరణ) బిల్లులను వంటి ముఖ్యమైన బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి.

కాగా ఈ స‌మావేశాలు 25రోజులు జ‌ర‌గ‌నున్నాయి. కాగా ఈ స‌మావేశాల్లో 36బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టేందుకు బిజెపి స‌ర్కార్ రెడి అవుతుంది. ఈ బిల్లుల్లో మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దుకు సంబంధించిన బిల్లు కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం . వీటితో పాటు పెగాసెస్, ధ‌ర‌ల పెంపుపై బిజెపిని ఇరుకున్ పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి ప్ర‌తిప‌క్షాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement