Friday, April 26, 2024

శ్రీ‌శైలం జ‌లాశ‌యానికి భారీగా వ‌ర‌ద‌… 10 రేట్లు ఎత్తివేత‌…

కర్నూలు : శ్రీశైలం జలాశయానికి భారీగావరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం జలాశయానికి ఇన్ ఫ్లో 4,29,363 క్యూ సెక్కులుగా ఉంది. ఇందులో జూరాల స్పీల్ వే గేట్ల నుంచి 2.43,396 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదన నుంచి 27258 క్యూ సెక్కులు, సుంకేసుల బ్యారేజ్ నుంచి 1,58,709 క్యూసెక్కుల చొప్పున మొత్తం 4,29,363 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యాంకు చేరుతుంది. దీంతో జలాశయంకు చెందిన 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 4,54,834 క్యూసెక్కుల నీరు దిగువ సాగర్ కు విడుదలవుతుంది. మొత్తంగా శ్రీశైలం ఆనకట్ట పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు, కాగా ప్రస్తుతం 884.60 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు, కాగా ప్రస్తుతం 213.4011 టీఎంసీలుగా నీటిని నిల్వ ఉంచారు. శ్రీశైలం స్పిల్వే గేట్ల ద్వారా – 3,77,650, కుడి విద్యుత్ కేంద్రంకు 14339, ఎడమ జల విద్యుత్ కేంద్రంలో 31784 క్యూసెక్కుల నీటి వినియోగంతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. వీటి తోపాటు హంద్రీనీవాకు 1688, పోతిరెడ్డిపాడు 14000 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement