Friday, May 3, 2024

ఉత్తరాదిన హీట్​ వేవ్​.. ఢిల్లీకి మాత్రం వర్ష సూచన

రానున్న 3 రోజుల్లో వాయువ్య భారతదేశంలోని మైదాన ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. నిన్న (సోమవారం) వాయువ్య భారతంలో వేడి ప్రభావం కొనసాగింది. జమ్మూ- కశ్మీర్, లడఖ్, గిల్గిట్- బాల్టిస్తాన్, యూపీ, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా,చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ- తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ- తూర్పు రాజస్థాన్ ప్రాంతాల్లో కూడా వేడి కాస్త పెరగనుంది.

ఇక.. ఢిల్లీలో రానున్న ఆరు రోజుల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని.. ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. ఏప్రిల్ 27, 28 తేదీల్లో తేలికపాటి వర్షం లేదా చినుకులు పడే అవకాశాలు ఉన్నాయి. 29న ఉరుములతో కూడిన వర్షం, ఏప్రిల్ 30న వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఏప్రిల్ 25 నుండి ఏప్రిల్ 26 వరకు ఉత్తరాఖండ్‌లో 30నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement