Sunday, May 5, 2024

కెనడాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..240 మంది మృతి

కెనడా ఎండలు మండిపోతున్నాయి. ఎండ వేడిమిని, వడగాడ్పులను తట్టుకోలేక 240 మంది కన్నుమూశారు. వాంకోవర్ లో పరిస్థితి మరింత భీతావహంగా ఉంది. ఇక్కడే సుమారు 135 మంది మృత్యువాతపడ్డారు. చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, కరోనా టీకా కేంద్రాలను, స్కూళ్లను మూసివేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ టీకాల పంపిణీ ఉండబోదని అధికారులు తెలిపారు. ఎండ నుంచి ఉపశమనానికి నడి రోడ్లపై టెంపరరీ వాటర్ ఫౌంటెయిన్ లు, నీటి జల్లు కేంద్రాలను, పలు ప్రాంతాల్లో కూలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇక స్విమ్మింగ్ పూల్స్, బీచ్ ల వద్ద ప్రజల సందడి అధికంగా ఉంది. ఇక యూఎస్ లోని పలు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా పోర్ట్ లాండ్, ఓరెగాన్, సియాటెల్, వాషింగ్టన్ ప్రాంతాల్లో విద్యుత్ కు డిమాండ్ పెరుగగా, సరఫరాకు అంతరాయాలు ఏర్పడ్డాయి. వెస్ట్ యూఎస్ లోని 4 కోట్ల మందిని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. 

ఇది కూడా చదవండి: నన్ను ఎదుర్కొనే దమ్ము లేదు.. ఇందుకే చిల్లర ప్రచారం: ఈటల

Advertisement

తాజా వార్తలు

Advertisement