Wednesday, April 24, 2024

నన్ను ఎదుర్కొనే దమ్ము లేదు.. ఇందుకే చిల్లర ప్రచారం: ఈటల

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. అయితే, టీఆర్ఎస్ సోషల్ మీడియా టీమ్ మాజీ మంత్రి ఈటలకు వ్యతిరేకంగా కొన్ని ఫేస్ న్యూస్ లను ప్రచారం చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల తనపై అభియోగాలు వచ్చిన సమయంలో సీఎం కేసీఆర్కు ఈటల రాసినట్టుగా ఉన్న లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి.

ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ స్పందించారు. తనపై టీఆర్ఎస్ ఐటీ విభాగం చిల్లర పనులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో తనను ఎదుర్కొనే దమ్ము లేక తనపై ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను అనని మాటలను అన్నట్లు, నేను ముఖ్యమంత్రికి లేఖ రాసినట్టు నా లేటర్ హెడ్ ను మార్పింగ్ చేయడం లాంటి వెక్కిలి పనులతో ఎన్నికకు ముందే మీరు మీ ఓటమిని అంగీకరించినట్టు భావిస్తున్నాను. వీ విషపు రాతలను, మీ అబ్దాప ప్రచారాలను తిప్పికొట్టి హుజురాబాద్ గడ్డమీడ ఆత్మగౌవర బావుటా ఎగరవేస్తాం ’ అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. తప్పుడు ప్రచారాలను మానుకోవాలని హెచ్చరించారు. త్వరలో జరగబోయే హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమన్నారు. తనపై అబండాలు వేసినంత మాత్రానా హుజూరాబాద్ నియోజకర్గ ప్రజలు నమ్మనన్నారు. హుజురాబాద్లో ఇప్పటికే టీఆర్ఎస్ ప్రలోభాలకు గురిచేస్తోందని ఆరోపించారు. ఎన్ని చేసినా హుజురాబాద్లో గెలుపు తమదేనని ఈటల రాజేందర్ దీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: పడవలో అపార్ట్మెంట్లు.. ధర రూ. 84 కోట్లు!

Advertisement

తాజా వార్తలు

Advertisement