Sunday, April 28, 2024

Big story : డ్రగ్స్‌ భూతంపై ఉక్కుపాదం, పీడీ యాక్టుతో పాటు కఠిన శిక్షలు.. సీఎం కేసీఆర్‌ కీలక యోచన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఒకవవైపు దసరా విక్రయాలు, మరోవైపు మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మద్యం ఏరులై పారుతోండగా, నగరాలు, పట్టణాల్లో యధేచ్చగా డ్రగ్స్‌ వినియోగం పెరిగిందని ప్రభుత్వ్వానికి నివేదికలందాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందుకు ప్రస్తుతం అమలులో ఉన్న మాదకద్రవ్యాల నియంత్రణ చట్టాలతో పెద్దగా ఫలితాలు రావడంలేదని ప్రభుత్వం అంచనా వేసింది. ఇకపై డ్రగ్స్‌ అంటేనే విక్రేతలు, వినియోగదారులు బెంబేలెత్తేలా కఠిన చట్టంతోపాటే శిక్ష పడేలా మార్పుల దిశగా సర్కార్‌ కార్యాచరణ ప్రారంభించింది. పోలీస్‌, ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్‌ ఇంటలిజెన్స్‌ సెల్‌తోపాటు, కఠిన చర్యలకు విధివిధానాలను సిద్దం చేస్తోంది. ప్రత్యేక బృందాలతో దాడులు చేస్తూనే నిందితులకు కఠిన శిక్షలు పడేలా, అంతిమంగా రాష్ట్రంలో డ్రగ్స్‌, అనే మాట లేకుండా, డ్రగ్స్‌ మాఫియా భరతం పట్టి మూలాలు లేకుండా మట్టుబెట్టేలా చట్టానికి కఠిన నిబంధనలు జోడించి అమలులోకి తేనున్నారు.

డ్రగ్స్‌ వినియోగించేవారు, దానితో సంబంధమున్నవారు ఎంతటివారైనా సరే కఠినంగా శిక్షించేలా సర్కార్‌ కదులుతోంది. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా 1000 మంది అధికారులతో కూడిన నార్కోటిక్‌ అండ్‌ ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ కంట్రోల్‌ సెల్‌ ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ విభాగం డీజిపి ఆధ్వర్యంలో డ్రగ్స్‌ను, వ్యవస్థీకృత నేరాలను నియంత్రించడంలో కఠిన చర్యల్లో భాగంగా ప్రత్యేక విధులను నిర్వహించనున్నది.

ప్రస్తుత చట్టంతో లాభం లేదని…

దేశంలో ప్రస్తుతం నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ యాక్టు అమలులో ఉంది. దేశంలో ఎక్కడైనా ఏదైనా కేసులో అరెస్టు అయిన నిందితులు నేరం నిరూపితమయ్యేంతవరకు దోషులుగా పరిగణించబడరు. ఈ చట్టం కింద అరెస్టయిన నిందితులు తమనుతాము నిర్దోషులమని నిరూపించుకునేంతవరకు దోషులుగానే చూస్తారు. అందుకే ఈ కేసుల్లో బెయిల్‌ దొరకడం కొత ఇబ్బందిగానే ఉంటుంది. 1985లో రూపుదిద్దుకున్న ఎన్డీపీఎస్‌ యాక్టు గడచిన నాలుగు దశాబ్దాల్లో మార్పులను సంతరించుకుంది.

- Advertisement -

1950లనుంచి 1970ల వరకు పాశ్యాత్య దేశాల్లో మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, అమ్మకాలు విచ్చలవిడిగా ఉండేవి. దీంతో ప్రపంచ దేశాలు అప్పట్లో మాదకద్రవ్యాలపై పోరు ప్రకటించాయి. 1961లో ఆయా దేశాలు పారిస్‌లో సింగిల్‌ కన్వెన్షన్‌ ఆన్‌ నార్కోటిక్‌ డ్రగ్స్‌ పేరుతో సమావేశమయ్యాయి. రానున్న 25 ఏళ్లలో డ్రగ్స్‌ మహమ్మారిని ఉక్కుపాదంతో అణిచివేసేలా చట్టాలు చేయాలని ఒప్పందం చేసుకున్నాయి. నాడు ఈ ఒప్పందంపై సంకాలు చేసిన దేశాల్లో భారత్‌ కూడా ఉంది. ఆ తర్వాత ఈ విషయాన్ని జాతీయ స్థాయిలో పెద్దగా పట్టించుకోలేదు. గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో 1985లో ఎన్డీపీఎస్‌ చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని 1988లో స్వల్ప సవరణ చేశారు. దీంట్లో భాగంగా మాదకద్రవ్యాల వ్యక్తిగత వినియోగానికి శిక్షను తగ్గించారు. డ్రగ్స్‌ను తక్కువ మోతాదులో వాడేవారు, మురికివాడల్లో ఉండే పేదలను ఈ చట్టం పేరుతో ఇబ్బందిపెడుతున్నారనే కారణంతో 1994లో ప్రధాని పీవీ హయాంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ కమిటీ సిఫార్సుల మేరకు 2001లో వాజ్‌పేయి హయాంలో మరికొన్ని మార్పులు చేశారు. 2014 మార్చిలో మన్మోహన్‌ సర్కార్‌ ఈ చట్టంలో పేర్కొన్న మరణశిక్షను తప్పనిసరినుంచి తప్పించి ఐచ్చికం చేసింది. న్యాయమూర్తుల విచక్షణకు శిక్షను వదిలేసింది. ఆ తర్వాత 2000నుంఇ 2004 వరకు దేశంలో ఎన్డీపీసి యాక్ట్‌ కింద ట్రయల్‌ కోర్టులు ఐదుగురికి మరణశిక్షలు విధించగా, పైకోర్టులో నలుగురికి యావజ్జీవ శిక్షగా, మరొకరికి నిర్దోశిగా శిక్షలు తగ్గాయి.

జైలుకు పంపేది లేదనే మినహాయింపు…

ఈ నేపథ్యంలో కేంద్ర సామాజిక న్యాయశాఖ జోక్యం చేసుకొని వ్యవక్తిగత వాడకానికి కొద్ది మొత్తంలో డ్రగ్స్‌ దగ్గర పెట్టుకున్నవారికి జైలుకు పంపొద్దని ఆదేశించింది. స్వల్ప మొత్తంలో డ్రగ్స్‌ కలిగి ఉండటాన్ని నేరంగా పరిగణించొద్దని పేర్కొంది. వాటిపై ఆధారపడే వారిని బాధితులుగా పరిగణించాలని, అటువంటివారిని జైలుకు కాకుండా డీ అడిక్షన్‌, పునరావాస కేంద్రాలకు పంపాలని సూచించింది. ఈ మేరకు చట్టంలో సవరణలను ప్రతిపాదించింది.

ఎన్డీపీఎస్‌ చట్టం ప్రకారమైతే…

ఎన్డీపీఎస్‌ చట్టం ప్రకారం భారత్‌లో డ్రగ్స్‌ వాడకం, కల్గి ఉండటాన్ని నేరంగా చూస్తారు. ఈ చట్టంలోని సెక్షన్‌ 27 ప్రకారం ఎటువంటి డ్రగ్స్‌ వాడినా ఏడాది వరకు జైలు శిక్ష, లేదంటే రూ. 20వేల జరిమానా, లేదంటే రెండూ విధించే అవకాశం ఉంది. ఎంత మోతాదులో డ్రగ్స్‌ను కలిగి ఉన్నారనే అంశాన్నిబట్టి విక్షలు మారుతాయి. 2గ్రాములనుంచి 99గ్రాముల కొకెయిన్‌, అరగ్రాము నుంచి 10 గ్రాముల దాకా ఎండీఎంఏ, 100గ్రాములనుంచి కిలోవరకు చరస్ను కల్గిఉంటే పదేళ్ల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తారు. ఇంతుకు మించితే మాదకద్రవ్యాలను విక్రయిస్తున్నట్లుగా భావించి 10నుంచి 20ఏళ్ల జైలు శిక్ష, రూ.2లక్షల జరిమానా విధిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement