Thursday, May 16, 2024

ప్రేమికుల రోజున హార్దిక్ పాండ్యా మరోసారి పెళ్లి..

టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మ‌రోసారి పెళ్లి చేసుకోబోతున్నాడ‌నే వార్త ఇప్పుడు సంచ‌ల‌నం అయింది.. హార్దిక్ పాండ్యా ఇప్పటికే నటి, మోడల్ నటాషా స్టాంకోవిచ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. జనవరి 1, 2020న దుబాయ్‌లో నిశ్చితార్థం చేసుకున్న హార్దిక్, నటాషా.. మే 31, 2020న సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు జూలై 2020లో వారి బాబు జన్మించారు. కాగా త‌మ ప్రేమ‌కు గుర్తుగా ప్రేమికులు రోజైన ఈ నెల 14వ తేదిన మ‌రోసారి పెళ్లి చేసుకోవాల‌ని హార్దిక్, న‌టాషాలు భావించారు.. అందుకు రాజస్థాన్‌లోని ఉదయపూర్ ని వేదిక చేసుకున్నారు.. అక్క‌డ 13 నుంచి హార్దిక్ పాండ్యా, నటాషా ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. 14న వివాహ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది ఈ గ్రాండ్ వెడ్డింగ్‌ కోసం హార్దిక్, నటాషా ఇప్పటికే ఉదయ్‌పూర్ చేరుకున్నారు. . ఈనెల 13 నుంచి 16 వరకు హల్దీ, మెహెందీ, సంగీత్ లాంటి కార్యక్రమాలతో వెడ్డింగ్‌ వైభవంగా జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement