Monday, April 29, 2024

జూన్ 29న – హ్యాపీ బ‌ర్త్ డే ట్రైల‌ర్ రిలీజ్

2019లో రిలీజ్ అయిన సినిమాల్లో బెస్ట్ చిత్రం ఒక‌టి మ‌త్తువ‌ద‌ల‌రా. ఈ చిత్రాన్ని రితేష రానా తెర‌కెక్కించారు. క్రైమ్ కామెడీ థ్రిల్ల‌ర్ నేపథ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్, క్లాప్ ఎంట‌ర్టైన‌మెంట్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి.మ‌ళ్ళీ ఇప్ప‌టివ‌ర‌కు ఈ ద‌ర్శ‌కుడి నుండి సినిమా రాలేదు. ఈ క్ర‌మంలో రితేష రెండేళ్ళు గ్యాప్ తీసుకుని ‘హ్య‌పి బ‌ర్త్‌డే’ సినిమా తెర‌కెక్కించాడు.లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రంలో వివేక్ అగ‌స్థ్య కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు. ఇప్ప‌టికే చిత్రం నుంచి విడుద‌లైన టీజ‌ర్‌కు విశేష స్పంద‌న వ‌చ్చింది. ముందుగా ఈ చిత్రాన్ని జూలై 15న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించగా ఇటీవ‌లే వారం రోజులు ముందుకు ప్రీ పోన్ చేస్తూ జూలై 8న రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కాగా ఇప్ప‌టికే మేకర్స్ సినిమాను విభిన్న పద్ధ‌తిలో ప్ర‌మోట్ చేస్తూ ప్రేక్ష‌కుల‌లో సినిమాపై అటెన్ష‌న్ క్రియేట్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్ అప్‌డేట్‌ను మేక‌ర్స్ సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు. బుధ‌వారం సాయింత్రం 4.05 నిమిషాల‌కు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement