Wednesday, May 15, 2024

గుజరాత్​లో పెరుగుతున్న కరోనా కేసులు.. ఎన్​ఐడీ సెంటర్​ ఇక మైక్రో కంటైన్​మెంట్​ జోన్​

రెండు రోజుల్లో 15 మంది విద్యార్థులు కరోనాబారిన పడ్డారు. దీంతో గుజరాత్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడి)ని మైక్రో కంటైన్‌మెంట్ జోన్‌గా ఆదివారం ప్రకటించారు. పాజిటివ్‌గా తేలిన వారిలో ఇన్‌స్టిట్యూట్‌లోని విదేశీ విద్యార్థులు కూడా ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (AMC) NID యొక్క కొత్త బాలుర హాస్టల్, C బ్లాక్‌ను మైక్రో కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించింది. AMC అధికారి మాట్లాడుతూ, “అన్ని అకడమిక్ టీచింగ్ మరియు అడ్మినిస్ట్రేషన్ పనులు ప్రస్తుతానికి నిలిపేశామని తెలిపారు.

సోమవారం నుండి, AMC యొక్క ఆరోగ్య శాఖ బృందాలు NID లోపలికి వెళ్లి నమూనాలను తీసుకొని స్క్రీనింగ్ పరీక్షలు చేయనున్నట్టు పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులను నిర్బంధించి మరీ చికిత్స అందిస్తామని తెలిపారు.  కాగా, గుజరాత్‌లో ఆదివారం 37 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 34 కేసులు అహ్మదాబాద్‌లో నమోదయ్యాయి. జామ్‌నగర్‌, వడోదరలో ఒక్కో కేసు నమోదు కాగా, గుజరాత్‌ గ్రామీణ ప్రాంతంలో ఒక్కో కేసు నమోదైంది. అహ్మదాబాద్‌లో అత్యధిక సంఖ్యలో కోవిడ్-19 కేసులు నమోదు కావడం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి.

Advertisement

తాజా వార్తలు

Advertisement