Tuesday, April 30, 2024

హామీ ఇస్తున్నా, ఇక కష్టాలుండవ్‌.. తండ్రులు, తాతల పరిస్థితి మీకు రానీయను: మోదీ

జమ్ము-కాశ్మీర్‌లో ప్రజాస్వామ్యం గ్రామగ్రామానికి చేరుకుందని ప్రధాని మోడీ స్పష్టంచేశారు. ఇక్కడి ప్రజల సాధికారికత కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. మీ తండ్రులు, తాతలు ఎదుర్కొన్న బాధలు, కష్టాలు ఇకపై మీకు రాబోవంటూ యువతకు భరోసా ఇచ్చారు. ఆదివారం జమ్ము-కాశ్మీర్‌లో పర్యటించిన ఆయన రూ.20వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. దేశంలో గొప్ప పంచాయితీరాజ్‌ వ్యవస్థ ఉన్నప్పటికీ జమ్ము-కాశ్మీర్‌ మాత్రం ఆ ఫలాలను అందుకోలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జమ్మూలో ప్రజాస్వామ్యం క్షేత్రస్థాయికి చేరుకోవడం గర్వకారణంగా ఉందన్నారు.

దేశంలో ఉన్న అంతరాలను చెరిపేసి, అందర్నీ ఏకం చేయాలన్న లక్ష్యంతోనే ఏక్‌ భారత్‌, శ్రేష్ఠ భారత్‌ అన్న నినాదాన్ని తీసుకొచ్చామని అన్నారు. జమ్ము-కాశ్మీర్‌ అన్ని విధాలా అభివృద్ధి చేయాలన్నదే తమ అభిమతమని ప్రధాని చెప్పారు. జమ్ము-కాశ్మీర్‌ చరిత్రలో అభివృద్ధి పనుల ద్వారా ఓ నూతన శకం ప్రారంభమైనట్లేనని వ్యాఖ్యానించారు. అటు ప్రజాస్వామ్యంలో గానీ, అభివృద్ధిలో గానీ.. జమ్ము-కాశ్మీర్‌ ఓ కొత్త ఉదాహరణగా ప్రజల ముందు నిలిచిందని సంతృప్తి వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా అభివృద్ది కొత్త పుంతలు తొక్కుతోందని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement