Friday, May 24, 2024

TS | క్రిస్మస్‌కు 5 రోజులు, సంక్రాంతికి 6 రోజులు.. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన సర్కారు

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: అక్టోబర్‌ నెల వొచ్చిందంటేనే సెలవుల కాలం వచ్చినట్లు లెక్క. ఈక్రమంలో దసరా సెలవులను ప్రకటించిన ప్రభుత్వం విద్యాసంస్థలకు క్రిస్మస్‌, సంక్రాంతి సెలవులను కూడా ఒకేసారి ప్రకటించింది. అక్టోబర్‌ 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పాఠశాలలు, కాలేజీలకు దసరా సెలవులు ఇప్పటికే ప్రకటించగా, దసరా తర్వాత వచ్చే దీపావళికి ఒక్క రోజు మాత్రమే సెలవు ఇచ్చారు.

డిసెంబర్‌ నెలలో వచ్చే క్రిస్మస్‌ సెలవులను ఐదు రోజులు ఇచ్చారు. అయితే మిషనరీ పాఠశాలలకు మాత్రమే ఐదు రోజులు సెలవులు ఇచ్చారు. మిగిలిన విద్యాసంస్థలకు మాత్రం ఒక్క రోజు సెలవు ప్రకటించారు. ఇక కొత్త ఏడాదిలో ఈ విద్యాసంత్సరానికి వచ్చే మరో పెద్ద పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి పడుగకు రాష్ట్ర సర్కారు ఆరు రోజులు సెలవులు ఇచ్చింది. భోగి, సంక్రాంతి, కనుమలకు ఆరు రోజుల సెలవు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement