Sunday, May 5, 2024

‘టాప్ గేర్’ మూవీకి ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్..

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. వాటి ఫలితాలు ఎలా ఉన్నా ఏడాది మూడు నుంచి నాలుగు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. రీసెంట్‌గా ఆయన నటించిన పులి మేక అనే వెబ్‌సిరీస్‌కు మంచి మార్కులు పడ్డాయి. అంతేకాకుండా క్రేజీ ఫెల్లో, సీఎస్ఐ సనాతన్, టాప్ గెర్ లాంటి సినిమాల‌కూ మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. క్రేజీ ఫెల్లో, సీఎస్ఐ సనాతన్ ఇప్పటికే ఓటీటీలో విడుదల కాగా.. తాజాగా టాప్ గేర్ మవీ కూడా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

రోడ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. మూవీ ఆద్యంతం ఎంగేజింగ్‌గా, థ్రిల్‌ను కలిగిస్తుందని చూసినవారు అంటున్నారు. డైరెక్టర్ విజన్, టెక్నికాలిటీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మూవీలో ఆది సరసన రియా సుమన్ హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీలో సత్యం రాజేష్, శత్రు, బ్రహ్మాజీ, మైమ్ గోపీ, నర్రా శ్రీను, రవి ప్రకాశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement