Tuesday, May 7, 2024

పసిడి పరుగులు, ఒకే రోజు రూ.1202 పెరుగుదల

ఉక్రెయిన్‌-రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా రూపాయి విలువ కూడా క్షీణిస్తున్నది. దేశీయంగా బులియన్‌ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర భారీగా పెరిగింది. ఢిల్లిdలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.1202 పెరిగింది. దీంతో తులం బంగారం రూ.52వేల వరకు పలికింది. ఆభరణాలకు ఉపయోగించే 22 క్యారెట్‌ 10 గ్రాముల బంగారంపై రూ.1000 వరకు పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం రూ.48వేలకు పైగా పలికింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. హైదరాబాద్‌లో 24 క్యారెట్‌ 10 గ్రాముల బంగారంపై రూ.1100 వరకు పెరిగింది. దీంతో తులం బంగారం 52వేలకు పైగా పలికింది. 22 క్యారెట్‌ 10 గ్రాముల బంగారంపై రూ.1000 వరకు పలికింది.

దీంతో తులం బంగారం రూ.48వేలకు వరకు నమోదైంది. విజయవాడలోనూ తులం బంగారంపై హైదరాబాద్‌తో సమానంగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,300 వరకు పలకగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200 వరకు పలికింది. వెండి ధర కూడా బంగారంతో పరుగులు పెడుతున్నది. ఢిల్లిdలో కిలో వెండిపై రూ.2,148 పెరిగి.. రూ.67,956కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1943 డాలర్లుగా, ఔన్స్‌ వెండి ధర 25.18 డాలర్లుగా ట్రేడ్‌ అయ్యింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement