Thursday, May 16, 2024

బిహార్‌లో బంగారు గ‌నులు.. త‌వ్వ‌కానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌నున్న కేంద్రం!

బిహార్‌లో బంగారు గనుల తవ్వకాలకు త్వరలోనే గ్రీన్ సిగ్నల్ లభించనున్నట్టు తెలుస్తోంది. జముయ్‌ జిల్లాలో పెద్ద ఎత్తున బంగారం నిల్వలు ఉన్నాయని, అక్కడ తవ్వకానికి అనుమతులు ఇచ్చే యోచనలో బిహార్ ప్రభుత్వం ఉన్నట్టు ఓ అధికారి వెల్లడించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే (GSI) ప్రకారం దాదాపు 222.88 మిలియన్ టన్నుల బంగారం అక్క‌డి నేల‌లో ఉంద‌ని, అందులో 37.6 టన్నుల ఖనిజాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అందులో ఎక్కువగా జముయ్ జిల్లాలోనే అధికంగా ఉన్నట్టు అంచ‌నా వేస్తున్నారు.

కాగా, గత ఏడాది దేశంలో బంగారు నిల్వల్లో ఎక్కువ వాటా బిహార్‌లో ఉందని కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్‌సభకు తెలియజేశారు. బిహార్‌లో 222.885 మిలియన్ టన్నుల బంగారం ఉందని, ఇది దేశంలోని మొత్తం బంగారం నిల్వల్లో 44 శాతం అని వెల్లడించారు. నేషనల్ మినరల్ ఇన్వెంటరీ ప్రకారం 2015 మార్చి నాటికి దేశంలోని 501.83 మిలియన్ టన్నుల ముడి బంగారు నిల్వలు ఉండగా.. అందులో ఒక్క బిహార్‌లోనే 222.885 మిలియన్ టన్నులు ఉందని జోషి తెలియజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement