Thursday, May 2, 2024

షావోమీ రెడ్‌మీ బ‌డ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్.. త్వ‌ర‌లో ఇండియ‌న్ మార్కెట్లోకి

బడ్జెట్ రేంజ్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు షావోమీ సబ్‌బ్రాండ్ రెడ్‌మీ సిద్ధమైంది. కంపెనీ అత్యంత చవకైన 5జీ మొబైల్‌గా రెడ్‌మీ 11 5జీ రానుంది. రెడ్‌మీ 10కు ఇది సక్సెసర్‌గా విడుదల కానుంది. మీడియాటెక్ డైమన్సిటీ 700 ప్రాసెసర్‌తో ఈ మొబైల్‌ వస్తుందని సమాచారం. అలాగే మరిన్ని స్పెసిఫికేషన్ల వివరాలు కూడా లీకయ్యాయి. 5000mAh బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 90Hz రిఫ్రెష్ రేట్ ఉండే LCD డిస్‌ప్లేతో రెడ్‌మీ 11 5జీ వస్తుందని తెలుస్తుంది. అలాగే ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్‌గా ఉండ‌నుంది. కాగా., రెడ్‌మీ 11 5జీ మొబైల్‌ భాారత్‌లో జూన్ నెల చివర్లో విడుదవుతుందని ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్లడైంది. అయితే 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ ఉండే వేరియంట్ ధర రూ.13,999 ధర ఉంటుందని అంచనా. అయితే షావోమీ త్వరలోనే ఈ మొబైల్‌ గురించి వెల్ల‌డింద‌చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

రెడ్‌మీ 11 5జీ స్పెసిఫికేషన్లు.. (అంచాన‌ల ప్ర‌కారం)

రెడ్‌మీ 11 5జీ మొబైల్‌ మీడియాటెక్ డైమన్సిటీ 700 ప్రాసెసర్‌తో గరిష్ఠంగా 4జీ ర్యామ్ ఉండనుంది. 6.58 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ LCD డిస్‌ప్లే. 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుందని తెలుస్తోంది. రెడ్‌మీ 11 5జీ వెనుక రెండు కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది. 50 మెగాపిక్సెల్ ప్రధాన కెెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉంటాయి. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను రెడ్‌మీ పొందుపరుస్తుందని సమాచారం. ఈ మొబైల్‌లో 5000mAh బ్యాటరీ ఉంటుందని, 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే పవర్ బటన్‌కే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండనుంది. కాగా 64జీబీ స్టోరేజ్ టాప్‌ వేరియంట్‌లో ఉంటుంది. స్టోరేజ్‌ను పొడిగించుకునేందుకు మైక్రోఎస్‌డీ కార్డు స్లాట్ ఈ మొబైల్‌లో ఉంటుంది. అలాగే ఇంటర్నల్ స్టోరేజీని ఉపయోగించుకొని వర్చువల్‌గా ర్యామ్‌ను ఎక్స్‌ప్యాండ్ చేసుకునే ఫీచర్ కూడా ఉండొచ్చని అంచనా.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement