Sunday, May 5, 2024

వాగులో కొట్టుకుపోయిన కారు-బాలిక మృతి

ప్ర‌మాద‌వ‌శాత్తు వాగులో కారు కొట్టుకుపోయింది. ఈ సంఘ‌ట‌న అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది . జిల్లాలోని పెద్దతిప్ప సముద్రం మండలంలోని సంపతికోట వాగులో కారు కొట్టుకుపోయింది. ఆ సమయంలో కారులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు ఉన్నారు. స్థానికులు గమనించి నలుగురిని కాపాడగా ఓ బాలిక కారులోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృత‌దేహాన్ని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement