Thursday, March 30, 2023

నా సోద‌రుడు తార‌క‌ర‌త్న త్వ‌ర‌గా కోలుకోవాలి.. ట్వీట్ చేసిన క‌ళ్యాణ్ రామ్

న‌టుడు తార‌క‌ర‌త్న యువ‌గ‌ళం పాదయాత్రలో పాల్గొని అస్వస్థతకి గుర‌యిన సంగ‌తి తెలిసిందే. ఆయనని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా గుండెపోటు వచ్చినట్లుగా వైద్యులు తెలిపారు. తారకరత్నకు గుండె నాళాల్లో ఎక్కువగా బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించారు. యాంజియోగ్రామ్ ద్వారా బ్లాక్ లను తొలగించారు. మరింత మెరుగైన వైద్యం కోసం తారకరత్న ని బెంగళూరుకు తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే బెంగళూరులో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్యం పై కళ్యాణ్ రామ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా.. నా సోదరుడు శ్రీ నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని ట్విట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement