Friday, April 26, 2024

తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు : మంత్రి కేటీఆర్‌

రాష్ట్ర ఏర్పాటు తర్వాత మోదీ ప్రభుత్వం ఇప్పటికీ తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వలేద‌ని, కేంద్రంలోని బీజేపీ తెలంగాణ పై కక్ష పూరితంగా వ్యవహరిస్తుంద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… నిజామాబాద్ కార్పొరేషన్ ప‌రిధిలో చేసిన అభివృద్ధి గురించి చెప్పాల్సిన బాధ్యత మున్సిపల్ మంత్రిగా నా పై ఉంద‌ని, రూ.936.69 కోట్లతో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామ‌న్నారు. ఇవికాక సీఎం కేసీఆర్ ఇక్కడికి వచ్చినపుడు రూ.100 కోట్ల నిధులు నిజామాబాద్ అభివృద్ధి కోసం ఇచ్చార‌ని, ఈ నిధులను క్షుణ్ణంగా ఆలోచించి కర్చు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించామ‌ని, ప్రజల అవసరాల కోసం కర్చు చేయనున్నామ‌న్నారు. నిజామాబాద్ పట్టణం కళాకారులకు, కవులకు పెట్టింది పేరు, ఇందూరు కళాభారతి అనేది ఒక అపురూప క్షేత్రం అన్నారు. అన్ని వర్గాల ప్రజల కోసం సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేస్తున్నారు. ఇక్కడ మంచినీటి సమస్యను పరిష్కరించుకున్నామ‌ని, నిజామాబాద్ ను ఐటీ హబ్ గా మారుస్తున్నామ‌న్నారు. వచ్చే నెలలో ఐటీ హబ్ ప్రారంభిస్తామ‌న్నారు. ప‌లు శిక్షణ కేంద్రాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశామ‌న్నారు. అన్ని మున్సిపాలిటీ లకు రూ.50 కోట్ల నిధులు మంజూరు చేస్తుమ‌ని, రాష్ట్ర ప్రభుత్వం ఎం చేసింది ఎవ్వరినీ అడిగిన చెప్పాల‌న్నారు. కానీ నిజామాబాద్ పార్లమెంట్ ప‌రిధిలో కేంద్రం నుండి ఎన్ని నిధులు కేటాయించారో ఎంపీ అరవింద్ చెప్పాల‌న్నారు. మోదీ నాయకత్వంలో ఈ బడ్జెట్ చివరి బడ్జెట్ కానుంద‌న్నారు.

రాష్ట్ర ఏర్పాటు తర్వాత మోదీ ప్రభుత్వం ఇప్పటికీ ఒక్క రూపాయి తెలంగాణకు ఇవ్వలేదు అన్నారు. రాష్ట్ర విద్యార్థులు యువత ఆలోచన చేయాలి.. కేంద్రంలోని బీజేపీ నేత‌లు తెలంగాణ పై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు. విభజన చట్టం హామీల‌ను ఇప్పటికీ నెరవేర్చని దుర్మార్గపు కేంద్రం ప్రభుత్వం తీరును గమనించాల‌న్నారు. మీ చిత్త శుద్ధిని చాటుకోవ‌డానికి ఈ బడ్జెట్ చివరి అవకాశం, అందుకే ఇప్పటికైనా రాష్ట్ర బిజెపి నేతలు కేంద్రాన్ని ప్రశ్నించాలి అన్నారు. పసుపు బోర్డును ఆటకెక్కించి ఇక్కడ ఉన్న జుట్ బోర్డ్ ను ఎత్తివేశారు. పన్నుల రూపంలో రూ.2 లక్షల కోట్లు తెలంగాణ సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో అభివృద్ధి చేస్తున్నారు. మనం కేంద్రానిల్లో ఎందుకు లేవు అన్నారు. కేంద్రం ఇచ్చే పల్లె ప్రగతి అవార్డులు, ఆదర్శ మున్సిపాలిటీ అవార్డులు తెలంగాణకు వస్తుంటే గల్లీలో ఉండే బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ప్రజల డబ్బులతో జాతీయ రహదారులు, ఏర్పో ట్ లు నిర్మించి గొప్పలు చెప్పుకుంటున్నారు. మోదీ కంటే ముందు 14 మంది ప్ర‌దానులు పనిచేశారు. వారందరూ కలిసి చేసిన అప్పు 66 లక్షల కోట్లు కానీకి ఇస్తున్నది ఎక్కువ, వారు మనకు ఇస్తున్నది చాలా తక్కువ.. ఇది తప్పు అని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధ‌మ‌న్నారు. తెలంగాణ గ్రామాల్లో ఉండే పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతా కేవలం మోదీ ఒక్కరే 100 లక్షల కోట్ల అప్పు చేశారు. ఈ అప్పుతో చేసిన అభివృద్ధి ఏమి లేదు అన్నారు. కానీ ఈ రోజు ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టింది కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. మేము అప్పు తెచ్చి బంగారు భవిష్యత్తు కోసం ఉత్పాదక రంగంలో పెట్టిన్నం అన్నారు.

మోదీ ఎవరికి దేవుడు పెట్రోల్, గ్యాస్, ధరలు పెంచినందుకు దేవుడా అని ప్ర‌శ్నించారు. చేనేత మీద జీఎస్టీ వేసినందుకు దేవుడా.. రైతన్నల పై నల్లచట్టాలు తెచ్చినందుకు దేవుడా.. అన్నారు. మోదీ కరోనా మందు కనుకున్నడని బీజేపీ నేతలు చెప్పటం హాస్యస్ప‌దం అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప బీజేపీ చేసింది ఏమీ లేద‌న్నారు. ఎన్డీఏ ఒక దివాలా కోరు ప్రభుత్వం, మీకు ఇది చివరి అవకాశం.. ఇకనైనా పద్దతి మార్చుకోండి అన్నారు. రేపు బడ్జెట్ లో రైతు బంధులాగా దేశం లోని రైతులకు ఎకరానికి రూ.5 వెలు ప్రకటించి వారి పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు. రూపాయి విలువ పాతాళానికి , అప్పులు ఆకాశానికి వెళ్ళాయి అన్నారు. తెలంగాణ ప్రాజెక్ట్ లకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. ఎంపీ అరవింద్ సభ్యత తో మాట్లాడు లేకుంటే బుద్ది చెప్పాల్సిన పరిస్థితి వస్తుంద‌న్నారు. అభివృద్ధిలో పోటీ పడి నీ సత్తా నిరూపించుకోవాలి అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజీరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే లు జీవన్ రెడ్డి ,గణేష్ గుప్తా షఖిల్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement