Monday, May 6, 2024

అమ్మవారికి చెప్పుల దండ సమర్పించే ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా?

భారత దేశంలో అనేక ఆలయాలు ఉండగా.. ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టత, ఆచార వ్యవహారాలు ఉన్నాయి. ఏ ఆలయంలోకి అయినా మనం ప్రవేశించేటప్పుడు చెప్పులను బయట వదిలి వెళ్తుంటాం. కానీ కర్ణాటక గుల్బర్గా జిల్లాలోని లక్కమ్మదేవి ఆలయంలో వింత ఆచారం ప్రకారం… ఇక్కడ అమ్మవారికి భక్తులు చెప్పులదండను సమర్పిస్తుంటారు. ఇక్కడ ప్రతి ఏటా దీపావళికి చెప్పుల ఉత్సవం కూడా నిర్వహిస్తారు.

ఈ ఆలయంలో అమ్మవారికి చెప్పులదండ సమర్పిస్తే ఆ తల్లి కోరిన కోరికలు తీరుస్తుందని భక్తుల నమ్మకం. ఇలా చేస్తే పాదాలు, మోకాళ్ల నొప్పులు శాశ్వతంగా తొలగిపోతాయని ప్రతీతి. పూర్వం ఈ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా ఎద్దులను బలి ఇచ్చేవారని భక్తులు చెప్తున్నారు. కానీ కొన్ని కారణాలతో ఈ ఆచారం నిలిచిపోయింది. అప్పటి నుంచి చెప్పులదండను సమర్పించే ఆచారం మొదలైందని చెబుతున్నారు. ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారికి శాఖాహారం, మాంసాహారాన్ని నైవేద్యంగా సమర్పించడం మరో విశేషం.

ఈ వార్త కూడా చదవండి: అత్యాచార బాధితురాలికి ఇచ్చిన చెక్కు బౌన్స్

Advertisement

తాజా వార్తలు

Advertisement