Wednesday, May 1, 2024

త్వరలో రామోజీ ఫిల్మ్ సిటీ వరకు మెట్రో రైలు: ఎంపీ కోమటిరెడ్డి

హైదరాబాద్‌లో ఉన్న మెట్రో రైలు సేవలను విస్తరించేందుకు కృషి చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువచ్చి మెట్రో రైలును రామోజీ ఫిల్మ్ సిటీ వరకు పొడిగించడానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. కాగా గురువారం అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎంపీ కోమటిరెడ్డి… రాచకొండ సీపీ మహేష్ భగవత్‌తో కలిసి భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నుండి నిధలు తెచ్చి భువనగిరి పార్లమెంట్ ప్రాంతం అభివృద్ధి కోసం కృషిచేస్తానని ఆయన అన్నారు. అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్‌ను రూ.2 కోట్లతో నిర్మించేందుకు ఈనాడు అధినేత రామోజీరావు ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అబ్దుల్లాపూర్ మెట్ నుండి చౌటుప్పల్ వరకు రియల్ ఎస్టేట్ అభివృద్థి చెందిందన్నారు. గౌరెళ్లి నుంచి ఛ‌త్తీస్‌గ‌డ్ స‌రిహ‌ద్దుల వ‌ర‌కు జాతీయ ర‌హ‌దారిని మంజూరు చేయించిన‌ట్లు వివ‌రించారు. ఆందోల్ మైస‌మ్మ నుండి ఎల్బీ న‌గ‌ర్ వ‌ర‌కు నేష‌న‌ల్ హైవే విస్త‌ర‌ణ కొర‌కు ప‌లు సార్లు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళితే రూ. 600 కోట్ల నిధులు మంజూరు చేసిన‌ట్లు పేర్కొన్నారు . అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పూర్తిచేశామని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు.

ఈ వార్త కూడా చదవండి: తెలంగాణలో ఈనెల 5 నుంచి కొత్త రేషన్ కార్డులు

Advertisement

తాజా వార్తలు

Advertisement