Wednesday, May 15, 2024

తిరుమ‌ల ఘాట్ రోడ్డుపై చెత్త‌ను ఏరిన.. జ‌స్టిస్ ఎన్వీర‌మ‌ణ‌

అలిపిరి తిరుమ‌ల ఘాట్ రోడ్డుపై చెత్త‌ను స్వ‌యంగా సేక‌రించారు సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ..టీటీడీ చేపట్టిన సుందర తిరుమల-శుద్ధ తిరుమల కార్యక్రమంలో ఆయ‌న‌ పాల్గొన్నారు. ప్లకార్డులో చేతబూని తిరుమల పరిశుభ్రతపై ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ మాట్లాడుతూ, తిరుమల పరిశుభ్రతను, పవిత్రతను కాపాడడం ప్రతి ఒక్క భక్తుడి కర్తవ్యం అన్నారు. తిరుమలకు వచ్చే భక్తులు ఇక్కడి పరిశుభ్రతను పరిరక్షించడం తమ బాధ్యతగా భావించాలని సూచించారు. నిర్దేశించి ప్రదేశాల్లోనే ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను పారవేయాలని తెలిపారు. సుందర తిరుమల-శుద్ధ తిరుమల కార్యక్రమంలో పాల్గొనడం దైవ కృపగా భావిస్తున్నానని తెలిపారు. తిరుమల స్వచ్ఛతను కాపాడేందుకు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేవతలు నడయాడే ఈ సప్తగిరులు అత్యంత పవిత్రమైనవని జస్టిస్ ఎన్వీ రమణ వివరించారు. తిరుమల దివ్యక్షేత్రంలో జరిగే కార్యక్రమాల్లో న్యాయమూర్తులు కూడా స్వచ్ఛంద సేవలు అందించే అవకాశం కల్పించాలని 2008లో అప్పటి టీటీడీ జేఈవోగా ఉన్న ధర్మారెడ్డిని తాను కోరిన విషయాన్ని ఎన్వీ రమణ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement