Monday, April 29, 2024

ఎల్లుండి కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ప్రమాణం..!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘ‌న‌ విజయం సాధించింది. 224 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో 136 స్థానాల్లో గెలుపొందింది. భారీ విజయంతో ఆ పార్టీ సంబురాల్లో మునిగిపోయింది. మరో వైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. కొత్త సీఎం ఈనెల 15న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.

కంఠీరవ స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్‌ ఏర్పాట్లు చేస్తున్నది. అయితే, ఎవరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొన్నది. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యతో పాటు పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ రేసులో ఉన్నారు. ఈ క్రమంలో ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారన్నది రేపు ఖరారు కానున్నది. రేపు బెంగళూరులో సీఎల్పీ సమావేశం కానున్నది. సీఎల్పీ నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement