Wednesday, May 15, 2024

ఆరోగ్య శాఖ‌కు డ‌బ్బు …జ‌బ్బు..

అమరావతి, ఆంధ్రప్రభ: ఫైళ్ళ క్లియెరెన్స్‌లో డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కార్యాలయం రూటే సెప’రేటు’. క్యాష్‌ కొడితే కానీ అక్కడ ఫైల్‌ కదలదన్న విమర్శలు బలంగా ఉన్నాయి. ఓ ఉన్నతాధికారి కనుసన్నల్లోనే అక్కడ అమ్యా మ్యాల వ్యవహరం నడుస్తోందన్నది బహిరంగ రహస్యం. అవినీతి మకిలి తన చేతికి అంటకూడదని కొందరు ఔట్‌సోర్సిం గ్‌ ఉద్యోగుల ద్వారా ఆ అధికారి మామూళ్ళు వసూళ్ళు చేయిస్తున్నారనే అభియోగాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వైద్యులకు ఇవ్వవలసిన రీపోస్టింగ్స్‌, సర్వీస్‌ రెగ్యులరైజేషన్‌ లతోపాటు- ఇతర ప్రాంతాలకు బదిలీల కొరకు పెట్టు-కున్న దరఖాస్తులను ప్రభుత్వానికి పంపాలంటే అధికారుల డిమాండ్‌ మేరకు ముడుపులు చెల్లించాల్సిందే. లేదంటే నిబంధనల బూచిని చూపి ‘కొర్రీ’ వేస్తున్నారని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. తనకి ప్రభుత్వ పెద్దల అండదండ లు ఉన్నాయని బిల్డప్‌ ఇచ్చే ఆ అధికారి మామూళ్ళు అందని ఫైళ్ళను నెలల తరబడి పెండింగ్‌లో పెట్టేస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. దీంతో సంబంధిత ఉద్యోగులు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఫైల్‌ క్లియెరెన్స్‌ కోసం డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ కార్యాలయం చుట్టూ ప్ర’దక్షిణ’లు చేయడం తప్పడం లేదు.

ఈ-6లో అవినీతి మేట
డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ లో ఈ 6 విభాగం పనితీరుపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఓ ఉన్నతాధికారి కనుసన్నల్లో పలువురు ఉద్యోగులు భారీ అవినీతికి పాల్పడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ ఉద్యోగి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని ఆ కార్యాలయ ఉద్యోగులు చర్చించుకోవడం కొసమెరుపు. ఉద్యోగులు చేసుకున్న దరఖాస్తులను నిబంధనల ప్రకారం సకాలంలో పరిష్కరించవలసి ఉంటుంది. ఏ రోజు వచ్చిన దరఖాస్తులు ఆ రోజే సంబంధిత రిజిస్టర్‌ నందు నమోదు చేసి ఈ ఆఫీసు ద్వారా ఆ ఫైల్‌ నోటు- సంబంధించిన ప్రొసీడింగ్‌ తయారుచేసి పై అధికారులకు పంపాల్సి ఉండగా ఇందుకు పూర్తి విరుద్ధంగా ఇక్కడ పాలన నడుస్తోందనే అభియోగాలు బలంగా ఉన్నాయి. బదిలీల కొరకు దరఖాస్తులతో భారీ ఎత్తుత బిజినెస్‌ చేస్తున్నారని భోగట్టా. రూల్స్‌ పేరుతో ఫోజుకొట్టే ఆ అధికారి ముడుపులు చేతిలో పడగానే మెత్తబడి ఫైళ్ళపై సంతకాలు చేస్తున్నారని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కార్యాలయంలో క్లియెరెన్స్‌, పెండింగ్‌ ఫైళ్ళను విజిలెన్స్‌ అధికారులు పరిశీలిస్తే అక్రమాల లెక్క తేలుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఫిర్యాదులు వస్తే పండగే
క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులపై అవినీతి ఆరోపణలతో ఫిర్యాదులు, ప్రభుత్వం నుండి ఫలానా ఉద్యోగులపై విచారణ జరపండి అని డైరెక్టర్‌ ఆఫ్‌కు ఆదేశాలు వస్తే అవినీతి రాయుళ్ళకు పండగే. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగికి వెంటనే డీహెచ్‌ కార్యాలయం నుంచి ఫోన్‌ వెళ్ళిపోతోంది. నీపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి విచారణాధికారి ఎవరు కావాలి? తూతూ మంత్రంగా విచారణ చేయిస్తాం మంచిచెడు చూసుకుంటావా? అంటూ డీహెచ్‌ కార్యాలయ అధికారులు బేరం పెడు తున్నారని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. రేటును బట్టి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగికి పనిష్మెంట్‌ ఇస్తు న్నారంటే ఆ అధికారులు ఎంత ధర్మప్రభువులో అర్థం చేసుకోవచ్చు. డీహెచ్‌ కార్యాలయానికి గడిచిన ఆరు నెలల్లో అందిన ఫిర్యాదుల్ని పరిశీలిస్తే వెనుకవి ముందు.. ముందువి వెనుకకు నడవడం వెనుక ఆ అధికారి ధనదాహం ఉందన్న విషయం తేటతెల్లం అవుతోంది. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఉద్యోగులపై సైతం నెలల తరబడి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. ఆ ఫైళ్ళను ఎందుకు పక్కన పడేశారనేదానికి అధికారులే సమాధానం చెప్పాల్సి ఉంది. ఏసీబీ, వి జిలెన్స్‌ను మెయింటెన్స్‌ చేస్తున్నామని డీహెచ్‌లోని పలువురు అవినీతి రాయుళ్లు కాలర్‌ ఎగరేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌లో తిష్టవేసిన అవినీతిపై ఏసీబీ కొరఢా ఝళిపించాల్సి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

- Advertisement -

సీఎం ఆదేశాలు బేఖాతర్‌
పకడ్బందీగా ఈ ఆఫీస్‌ నిర్వహించాలని స్వయంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పలు సందర్భాల్లో సమీక్షల సందర్భంగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌లో పూర్తిస్థాయిలో ఈ ఆఫీస్‌ నిర్వహణ జరగడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ ఆఫీసు నిర్వహణకు కావలసిన బడ్జెట్‌ ప్రభుత్వం విడుదల చేస్తున్న ఇంకా ప్రతి ఫైలు ఈ ఆఫీస్‌ ద్వారా పరిష్కారం కాకపోవడం వెనుక అవినీతి రాయుళ్ళ కాసుల కక్కూర్తి ఉందన్నది బహిరంగ రహస్యం. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి వైద్య ఆరోగ్యశాఖకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉద్యోగుల భర్తీ, క్షేత్రస్థాయిలో మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. బాధ్యతగా మెరుగైన పాలన అందించాల్సిన అధికారుల్లో కొందరు అమ్యామ్యాలకు అలవాటు పడటం వల్ల డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌కు అవినీతి మకిలి అంటుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీని వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. అవినీతి ఆరోపణలో వచ్చిన ఉద్యోగులపై తూతూ మంత్రపు విచారణలో చేసి క్లిన్‌చిట్‌ ఇచ్చి మళ్లీ అదే సీటు-లో కొనసాగించడంతో లంచావతారాలు రెచ్చిపోతున్నాయనే వాదనలు ఉన్నా యి. ఉద్యోగుల నుంచి వచ్చే దరఖాస్తుల్ని సీనియారిటీ-ని బట్టి నిర్ణయాలు తీసుకుని ఈ ఆఫీసు ద్వారా ఉత్తర్వుల్ని మెయిల్‌ ద్వారా వారికి పంపితే చాలావరకు అవినీతికి చెక్‌ పెట్టవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement