Monday, April 29, 2024

గ్రామీణంలో వైసిపి ప‌ట్టు స‌డలుతుంది…..

అమ‌రావ‌తి … రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 94 శాతానికి పైగా అన్ని స్థానాలను అధికార పార్టీ కైవసం చేసుకుంది. పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో పాటు మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ వైసీపీ భారీ మెజారిటీతో అత్యధిక స్థానాలను సొంతం చేసుకుంది. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ అధికార పార్టీ నుంచి ప్రజా ప్రతినిధులు ప్రతి గ్రామంలోనూ ఉన్నారు. అలాగే పార్టీ పదవుల్లోనూ భారీ సంఖ్యలో నేతలు ఉన్నారు. వారిలో దాదాపుగా 50 శాతం మందికి పైగా నేతలు తమ తమ గ్రామాల పరిధిలో పట్టు ఉన్న నాయకులే. మిగిలిన 50 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నేతలు పవర్‌లో ఉన్నారు. అయితే దశాబ్దాలుగా సొంత గ్రామాల్లో బలం ఉన్న నాయకులుగా పేరు తెచ్చుకున్న నాయకులంతా వైసీపీ అధికారంలోకి వస్తే తమ తమ గ్రామాల పరిధిలో మరింత పట్టును సాధించుకోవచ్చని ఆశించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎదురైన అవమానాలకు పవర్‌తో సమాధానం చెప్పాలని యోచించారు. అయితే సొంత గ్రామాల్లోనూ ఎమ్మెల్యే చెప్పనిదే ఏ పని జరిగే పరిస్థితి కనిపించకపోవడంతో ఆవె దనకు గురవుతున్నారు.

ఎమ్మెల్యేల ఎత్తుగ‌డ‌..
రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలకు.. ద్వితీయ స్థాయి నాయకు ల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయి. మరికొన్ని నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. ఇంకొన్ని నియోజకవర్గాల్లో స్థానిక నేతలను.. ఎమ్మెల్యేలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇలా పలు రకాల సందేహాలతో స్థానిక నేతలకు అధికారం ఇస్తే నియోజక వర్గం పరిధిలో తమ పట్టు ఎక్కడ చేజారుతుందోనన్న భయంతో కొంతమంది ఎమ్మెల్యేలు మండల స్థాయి నేతలకు అధికారం ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. ఫలితంగానే స్థానిక నేతలు అధికారుల వద్ద అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే విషయాన్ని కొంతమంది ద్వితీయ స్థాయి నేతలు .. ఎమ్మెల్యేలు , మంత్రులు దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ .. ప్రయోజనం లేకుండా పోతుంది. మీకు ఏ పని కావాలన్నా.. ఏ సమయంలోనైనా.. తాము అందుబాటులో ఉంటామని, ఒక్క ఫోన్‌కాల్‌ చేస్తే అధికారులకు చెప్పి మీ సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నారే తప్ప.. వారి చేతికి పవర్‌ ఇవ్వడం లేదు. మా పార్టీ అధికారంలో ఉన్నా ప్రయోజనం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement