Tuesday, April 30, 2024

లోకేష్ తో నా అనుబంధాన్ని విడదీయలేవు -అచ్చెన్నాయుడు

తిరుపతి ఎన్నికల తరువాత పార్టీ లేదు… బొక్క లేదు అంటూ అచ్చెన్నాయుడు కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. ఇక ఆ వీడియో పై అచ్చెన్నాయుడు స్పందించారు. నువ్వు నీ దొంగ సాక్షి ఎన్ని తప్పుడు వీడియోలు తీసుకొచ్చిన టిడిపిలో విభేదాలు సృష్టించలేవని అచ్చెన్నాయుడు అన్నారు.

చంద్రబాబు నాయకత్వంలో తిరుపతిలో టిడిపి నాయకులు ఐకమత్యంతో పని చేస్తుండడంతో నీకు భయం పట్టుకుంది. నారా లోకేష్ విసిరిన సవాల్ కు తోకముడిచి నిన్న తిరుపతిలో చంద్రబాబు చంద్రబాబు సభ పై రాళ్లు వేయించారు. ఇవాళ నా సంభాషణలు వక్రీకరించావు. నువ్వు ఎన్ని పన్నాగాలు పన్నినా టిడిపి విజయాన్ని అడ్డుకోలేరు. నారా లోకేష్ తో నాకున్న అనుబంధాన్ని విడదీయలేవు అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement