Thursday, March 28, 2024

కోలుకున్న మార్కెట్లు..

కరోనా కేసుల దెబ్బకు నిన్న కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ గాడిలో పడ్డాయి. నిన్న సెన్సెక్స్ ఏకంగా 1,707 పాయింట్లు పతనమైంది. అయితే . కరోనా వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈరోజు మార్కెట్లపై ప్రభావం చూపింది. వివిధ దేశాల్లో ఆమోదం పొందిన వ్యాక్సిన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించడంతో ఇన్వెస్లర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 661 పాయింట్లు లాభపడి 48,544కి చేరుకుంది. నిఫ్టీ 194 పాయింట్లు పెరిగి 14,504 వద్ద స్థిరపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement