Monday, April 29, 2024

ఫోర్డ్ రిట‌ర్న్ టూ భారత్‌.. ఈ సారి ఈవీ వాహనాల తయారీకి నిర్ణయం..

అమెరికాకు చెందిన కార్ల తయారీ దిగ్గజ కంపెనీ ఫోర్డ్‌ భారత్‌లో వ్యాపారం విషయంలో యూ టర్న్‌ తీసుకుంది. ఇది ఫోర్డ్‌ కార్ల ప్రియులకు గుడ్‌ న్యూస్‌. భారత్‌ మార్కెట్లో తాము నిలదొక్కుకులేకపోతున్నామని, తిరిగి అమెరికా వెళ్లిపోతామంటూ.. గతేడాది ఫోర్డ్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. ఫోర్డ్‌ మళ్లి ఈ ప్రకటనపై ఆలోచనలు చేస్తున్నది. భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేసేందుకు నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఇక్కడి నుంచే విదేశాలకు ఎగుమతి చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఎలక్ట్రిక్‌ వాహనం కోరుకునే వారికి ఫోర్డ్‌ దేశీయంగా కార్లను తయారు చేసి ఇవ్వనుంది. టెస్లాపై ఇప్పటి వరకు ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఫోర్డ్‌ తెరపైకి రావడంతో టెస్లా అంచనాలు తలకిందులు అవుతున్నాయి. ఎలక్ట్రిక్‌ కార్ల తయారీకి సంబంధించిన 20 కంపెనీల్లో ఒకటిగా ఫోర్డ్‌ నిలిచింది. మారుతీకి సంబంధించిన జపనీస్‌ పేరెంట్‌ కంపెనీ సుజుకీ గుజరాత్‌ అనుసబంధ సంస్థ కూడా ఉంది. ఈ కంపెనీలు.. ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేసి.. విక్రయిస్తాయి. దీని కోసం రూ.25,938 కోట్ల పీఎల్‌ఐ స్కీం ప్రయోజనాలు పొందుతాయి.

కేంద్రానికి ఫోర్డ్‌ ధన్యవాదాలు..

ఫోర్డ్‌ కూడా పీఎల్‌ఐ స్కీం ప్రయోజనాలు పొందనుంది. పీఎల్‌ఐ స్కీంలో తమను చేర్చాలన్న అభ్యర్థనను కేంద్ర ప్రభుతం అంగీకరించిందని ఫోర్‌ ్డ ప్రకటించింది. ఈ విషయమై కేంద్ర ప్రభుతానికి ధన్యవాదాలు తెలియజేసింది. గుజరాత్‌లోని సానంద్‌ ప్లాంట్‌లో ఫోర్డ్‌ తన ఎలక్ట్రిక్‌ కార్లను తయారు చేస్తుంది. భారత్‌లో ఫోర్డ్‌కు రెండు ప్లాంట్లు ఉన్నాయి. 100శాతం ఉత్పత్తిని ఎగుమతి చేసే ప్రణాళికలతో ఎలక్ట్రిక్‌ వాహనాలు తయారు చేసేందుకు ఫోర్డ్‌ నిర్ణయించింది. పీఎల్‌ఐ స్కీం కింద ఇప్పటికే అశోక్‌ లేల్యాండ్‌, ఐషర్‌ మోటార్స్‌, ఫోర్డ్‌ ఇండియా, హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా, కియా ఇండియా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, పీసీఏ ఆటో మొబైల్స్‌ ఇండియా, పీనెకల్‌ మొబిలిటీ సొల్యూషన్స్‌, సుజుకీ మోటార్‌ గుజరాత్‌, టాటా మోటార్స్‌ ఉన్నాయి. వీటితో పాటు త్రి చక్ర వాహన తయారీ కంపెనీలు బజాజ్‌ ఆటో, హీరో మోటోకార్ప్‌, పియాజియో వెహికిల్స్‌, టీవీఎస్‌ మోటార్‌ ఉన్నాయి.

రాణించగలదా.. అన్న అనుమానం..

కంపెనీ నిష్క్రమణ సమయంలో.. ముస్టాంగ్‌ వంటి మార్క్‌ బ్రాండ్‌లను విక్రయించడం ద్వారా భారతదేశంలో ఉనికిని వాగ్ధానం చేసిన కంపెనీ.. ఎలక్ట్రిక్‌ వాహనాలు తయారు చేసి.. ఎగుమతి చేయగలదా..? భారత్‌ మార్కెట్‌లో రాణించగలదా..? అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి ఒకరు మాట్లాడుతూ.. భారతదేశానికి సంబంధించిన ఎలక్ట్రిక్‌ ఫోకస్‌, దాని ఫలితంగా వచ్చే ప్రోత్సాహక పథకాలపై ఫోర్డ్‌ విశ్వాసం వ్యక్తం చేసిందన్నారు. భారత్‌లో ఎలక్ట్రిక్‌ కార్లను విక్రయించగలమని ఫోర్డ్‌ తెలిపింది. భారత్‌లో ఈవీ వాహనాలు ఫోర్డ్‌ విక్రయించగలదా..? అన్న ప్రశ్నకు పైవిధంగా కంపెనీ స్పందించింది. భారత్‌లో అమ్మకాల విషయంలో.. పూర్తి స్థాయిలో చర్చలు జరగలేవని, భవిష్యత్తు గురించి కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు. జనవరి 9న దరఖాస్తులు ముగిసే సమయానికి.. అడ్వాన్స్‌డ్‌ ఆటోమోటివ్‌ టెక్నాలజీ (ఏఏటీ) ఉత్పత్తులు, వాహనాలు, విడి భాగాల కోసం మొత్తం 115 కంపెనీలు ప్రభుత్వ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఎంపికైన కంపెనీలకు 2024 నుంచి ప్రోత్సాహకాలు ప్రారంభించబడుతాయి. ఐదేళ్ల వ్యవధిలో విస్తరించబడుతాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement