Saturday, May 4, 2024

హిడింబ మూవీ షూట్ కి.. గుమ్మడికాయ కొట్టేశారు

హిడింబ మూవీ షూటింగ్ పూర్తయిందని ఈ చిత్ర మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీలో హీరోగా అశ్విన్ నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్‌ అప్‌డేట్‌ను వెల్లడించనున్నట్లు చిత్ర బృంద తెలిపింది. అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీవిఘ్నేష్‌ సినిమాస్‌ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్‌ నిర్మించాడు. అశ్విన్‌కు జోడీగా నందితా శ్వేత హీరోయిన్‌గా నటించింది. వికాస్‌ బడిసా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాజశేఖర్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.ఈ చిత్రానికి అనీల్‌ కన్నెగంటి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్‌ సినిమాపై మంచి అంచనాలు నెలకొల్పాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement