Thursday, May 2, 2024

Food Crisis: ఆఫ్గాన్‌లో ఆక‌లి కేక‌లు.. తిండిలేక ప‌స్తులుంటున్న ల‌క్ష‌లాది మంది..

Afghan: తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైన‌ తర్వాత ఆఫ్గాన్‌లో ఆహార సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. లక్షలాది మందికి తిండి దొరక్క‌ పస్తులుంటున్నారని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. తిండికొర‌క్క ఆక‌లి కేక‌ల‌తో అల‌మ‌టించిపోతున్నారు అక్క‌డి జ‌నం.

తక్షణమే చర్యలు చేపట్టకపోతే అఫ్గానీయుల ఆకలి కేకలతో దారుణ పరిస్థితులు ఏర్పడుతాయని ఐక్యరాజ్యసమితి మరోసారి హెచ్చరించింది. ఈ వింట‌ర్‌లో లక్షల మంది అఫ్గాన్‌ వాసులు వలస వెళ్లడమో లేదా ఆకలితో అలమటించి చావ‌డ‌మో జ‌రుగుతుందంటున్నారు అధికారులు. మహా విపత్తుకు కౌంట్‌డౌన్‌ మొదలయ్యిందని తక్షణమే చర్యలు చేపట్టాలని యూఎన్‌వో సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement