Monday, April 29, 2024

Followup: భారత భూభాగాలపై నేపాల్‌ పార్లమెంట్‌లో చర్చ.. కాలాపానీ, లిపులేక్‌, లింపియాధురాలపై కామెంట్స్‌

భారత భూభాగంలోని కాలాపానీ, లిపులేఖ్‌, లింపియాధురాలపై నేపాల్‌ పార్లమెంట్‌లో చర్చ జరిగింది. ఆ భూభాగాలు నేపాల్‌లోనివంటూ మరోసారి తన బుద్ధిని బయటపెట్టింది. మిత్రదేశంగా భావిస్తున్నప్పటికీ… భారత భూభాగాలపై ఎప్పటికప్పుడు పేచీ పెడుతూనే ఉంది. గతంలో ప్రధానిగా ఉన్న కేపీ శర్మ ఓలీ చైనాకు మద్దతుగా ఉండేవారు. భారత్‌ భూభాగాలు లిపులేక్‌, లింఫియాధురా, కాలాపానీ ప్రాంతాలను తమ దేశానికి చెందినవిగా తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

తాజాగా మరోసారి నేపాల్‌ ఈ మూడు ప్రాంతాలపై పార్లమెంట్‌లో చర్చించింది. ఈ సందర్భంగా నేపాల్‌ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బా కీలక ప్రకటన చేశారు. ”ఈ సమస్యను ఇరు దేశాలు దౌత్యమార్గాల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం… ప్రభుత్వం తీసుకున్న విధానాల్లో ఈ వివాదాస్పద ప్రాంతాల సమస్యకు కూడా ప్రాధాన్యత ఇచ్చాం… నేపాల్‌ తన భూభాగాలను రక్షించుకోవడానికి సిద్ధంగా ఉంది. సరిహద్దు సమస్య చాలా సున్నితమైనది, నేపాల్‌కు లిపులేక్‌, లింపియాధురా, కాలాపానీ ప్రాంతాలపై అవగాహన ఉంది. నేపాల్‌ అలీన విధానాన్ని అనుసరిస్తుంది… జాతీయ ప్రయోజనాలే ముఖ్యం” అని దేవ్‌బా పునరుద్ఘాటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement