Saturday, May 4, 2024

Follow up : ఇంగ్లండ్‌-ఇండియాలో కెప్టెన్‌ బుమ్రా వరల్డ్‌ రికార్డు.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ 416

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిడియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. తొలి రోజు రిషబ్‌ పంత్‌ మెరుపు సెంచరీ చేయగా, రెండో రోజు తొలి సెషన్‌లో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో జడేజాకు ఇది మూడో సెంచరీ. ఈఏడాది రెండో సెంచరీ. అటు ఓవర్సీస్‌లో మాత్రం జడేజాకు ఇదే తొలి సెంచరీ. జడేజా 194 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లతో సెంచరీ చేశాడు. రవీంద్ర జడేజా సెంచరీ (104) చేయగానే అండర్సన్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. అటు కెప్టెన్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా 16 బంతుల్లో రెండు సిక్సులు, 4 ఫోర్లతో 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 338/7 ఓవర్‌నైట్‌ స్కోరుతో శనివారం రెండో రోజు రవీంద్ర జడేజా 67, మహ్మద్‌ షమీ 0 పరుగులతో బ్యాటింగ్‌ ఆరంభించారు. ఈ క్రమంలో 194 బంతుల్లో 13 ఫోర్లతో జడేజా సెంచరీ పూర్తి చేశాడు. షమీ 31 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేయగా, స్టువర్ట్‌ బ్రాడ్‌ వేసిన 80వ ఓవర్‌ చివరి బంతికి షమి షాట్‌పిచ్‌ బంతిని గాల్లోకి ఆడి క్రాలే చేతికి చిక్కాడు. దీంతో టీమిండియా 371 పరుగుల వద్ద 8వ వికెట్‌ కోల్పోయింది. కాసేపటికే జిడ్డూ సూతం అండర్సన్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 375/9గా నమోదైంది. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ బుమ్రా 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 31 నాటౌట్‌గా మెరుపు బ్యాటింగ్‌ చేశాడు. స్టువర్ట్‌ బ్రాడ్‌ వేసిన 84వ ఓవర్‌లో చెలరేగిపోయాడు. ఆ ఓవర్‌లో మొత్తం 2 సిక్సులు, 4 ఫోర్లు కొట్టడంతో 35పరుగులు రాబట్టాడు. అయితే అండర్సన్‌ వేసిన మరుసటి ఓవర్‌ ఐదో బంతికి సిరాజ్‌(2) ఔటవ్వడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో భారత జట్టు 416 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో అండర్సన్‌ 5 వికెట్లు తీయగా… పాట్స్‌ 2 వికెట్లు, బ్రాడ్‌, స్టోక్స్‌, రూట్‌ తలో వికెట్‌ తమ ఖాతాల్లో వేసుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ ఓపెనర్లు అలెక్స్‌ లీస్‌ (6), జాక్‌ క్రావ్లీ (9) పరుగులకే వెనుదిరిగాడు. ఈ రెండు వికెట్లు టీమిండియా కెప్టెన్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఒల్లిపోస్‌ 6, జో రూట్‌ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. వర్షం రావడంతో మ్యాచ్‌ను అర్ధంతరంగా ఆపేశారు.

పంత్‌-జడేజా ఐదో అత్యుత్తమ భాగస్వామ్యం
కాగా ఈటెస్టులో 98 పరుగులకే టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయిన దశలో రిషబ్‌ పంత్‌, రవీంద్ర జడేజా ఆరో వికెట్‌కు 222 పరుగులు జోడించారు. టీమిండియా ఆరో వికెట్‌ తరఫున ఇది ఐదో అత్యుత్తమ భాగస్వామ్యం. 1986లో ఆస్ట్రేలియాపై రవిశాస్త్రి, వెంగ్‌సర్కార్‌ ఆరో వికెట్‌కు 298 పరుగులు జోడించి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. 1986లోనే అజారుద్దీన్‌, కపిల్‌దేవ్‌ జోడీ శ్రీలంకపై ఆరో వికెట్‌కు 272 పరుగులు చేసి రెండో స్థానంలో, 2009లో మహేందర్‌సింగ్‌ ధోనీ, రాహుల్‌ ద్రవిడ్‌ శ్రీలంకపై 224 పరుగులు చేసి మూడో స్థానంలో, 1997లో అజారుద్దీన్‌, సచిన్‌ టెండూల్కర్‌ జోడీ దక్షిణాఫ్రికాపై 222 పరుగులు చేసి నాలుగో స్థానంలో ఉన్నారు.

బుమ్రా వరల్డ్‌ రికార్డు
టెస్టు క్రికెట్‌ చరిత్రలో జస్‌ప్రీత్‌ బుమ్రా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బుమ్రా నిలిచాడు. 85వ ఓవర్‌లో స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో బౌండరీల వరద పారించాడు. దీంతో ఆ ఓవర్‌లో 35 పరుగులు వచ్చాయి. ఇప్పటి వరకు ఒక ఓవర్‌లో ఇవే అత్యధిక పరుగులు అయితే, ఇందులో ఓ వైడ్‌ బాల్‌ ఫోర్‌గా వెళ్లింది. మరొకటి నో బాల్‌. ఇందులో 29 పరుగులు బుమ్రా చేశాడు. గతంలో లారా పేరిట ఉన్న 28 పరుగుల రికార్డును అధిగమించాడు. 84వ ఓవర్‌ తొలి బంతిని బౌండరీకి తరలించగా, రెండో బాల్‌ వైడ్‌. ఫోర్‌గా వెళ్లింది. మరో బంతి నో బాల్‌, సిక్స్‌, ఆ తర్వాతి బంతి ఫోర్‌, ఇక మూడో బంతిని ఫోర్‌గా మలిచాడు బుమ్రా. దీంతో తొలి మూడు బంతుల్లోనే 24 పరుగులొచ్చాయి. 4వ బాల్‌, 5వ బాల్‌ను వరుసగా ఫోర్‌, సిక్స్‌గా బాదేశాడు. ఇక ఓవర్‌ చివరి బంతిని బౌండరీ తరలించే యత్నం చేయగా బ్రాడ్‌ అడ్డుకున్నాడు. అప్పటికే బుమ్రా ఓ పరుగు చేశాడు. దీంతో ఒక ఓవర్‌లో 356 పరుగులు టీమిండియా సాధించింది. ఇందులో బుమ్రా 29 పరుగులు చేశాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement