Friday, December 6, 2024

బీహార్‌లో బాణాసంచా పేలుడు.. ఆరుగురు దుర్మరణం, మరో 8మందికి గాయాలు..

బీహార్‌లోని ఖుదాయ్‌భాగ్‌ గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలైనారు. మరో ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఛాప్రా జిల్లా కేంద్రానికి 30 కి.మీ.దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. షాబిర్‌ హుస్సేన్‌ అనే వ్యాపారి తన ఇంట్లోనే బాణాసంచా తయారు చేయిస్తుండగా ఈ పేలుడు సంభవించింది.

పేలుడు ధాటికి ఇల్లు దాదాపు అంతా కుప్పకూలింది. శిథిలాల కింద దాదాపు పదిమంది కార్మికులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. పేలుడుకు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఫోరెన్సిక్‌, బాంబ్‌ స్క్వాడ్‌లను పిలిపించినట్లు శరణ్‌ ఎస్‌పీ సంతోష్‌కుమార్‌ తెలిపారు. ఇంట్లోని పేలుడు పదార్థాలు దాదాపు గంటసేపు పేలుతూనే ఉండటం గమనార్హం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement